Pawan Kalyan: నాచురల్ స్టార్ నాని, ఎక్స్‌ప్రెషన్స్ క్వీన్ నజ్రియా నజీమ్ జంటగా నటించిన చిత్రం ‘అంటే.. సుందరానికీ!’. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకులతో వెరీ గుడ్ అనిపించుకోవటంతో పాటు.. విమర్శకులనుంచి కూడా మంచి రివ్యూలను సొంతం చేసుకుంది. గురువారం జరిగిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిధిగా హాజరైన సంగతి తెలిసిందే. ప్రీరిలీజ్ ఈవెంట్‌లో సినిమాలు, రాజకీయాలు వేరంటూ ఆయన చేసిన వ్యాఖ్య ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ‘అంటే.. సుందరానికీ!’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పవన్ మాట్లాడుతూ.. ‘‘ సినిమాలు వేరు రాజకీయాలు వేరు.. ఆ స్పష్టత నాకుంది’’ అని అన్నారు.
ఈ వేధికపై పెద్దగా రాజకీయాల గురించి మాట్లాడలేదు. కానీ, గతంలో ‘‘రిపబ్లిక్’’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో రాజకీయాల గురించి మాట్లాడారు. అప్పటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వంపై కొందరు మంత్రులపై విరుచుకుపడ్డారు. ‘‘ దిల్ రాజు గారు ఎందుకండి! సినిమా చేశారు మాతోటి.. చంపుతున్నారు. సినిమాలు రిలీజ్ చేయండి.. మీరు రెడ్డి వాళ్లు రెడ్డి.. తేల్చుకోండి.. రెడ్డి రెడ్డి తేల్చుకోండి’’ అని అన్నారు. అయితే, రిపబ్లిక్ సినిమా టైంలో సినీ వేధికపై రాజకీయాల గురించి మాట్లాడిన పవన్ ఇప్పుడు ఎందుకు మాట మార్చారంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. నాని సినిమా వేధికపై రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నిస్తున్నారు.
ప్రస్తుతం అప్పుడు అలా, ఇప్పుడు ఇలా అంటూ రెండు సందర్భాల్లో ఆయన మాట్లాడిన మాటలున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, గురువారం జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో నాని మాట్లాడుతూ.. ‘‘ ఈ సినిమాలో నటించినందుకు గర్వంగా ఫీలవుతున్నా. నేను సినీ ఇండస్ట్రీలోకి వచ్చి తరువాత అందరు స్టార్ హీరోలను కలిశాను.. కానీ పవన్ కళ్యాణ్‌ను ఎప్పుడు కలవలేదు. విచిత్రంగా ఎప్పుడు కూడా సందర్భం రాలేదు. ఈ ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్ రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుతుంటే ఎంతో గర్వంగా ఉంద’’ని అన్నారు.
ఇవి కూడా చదవండి : Ante Sundaraniki Review: న్యాచురల్ స్టార్ నాని ‘అంటే సుందరానికి’ మూవీ రివ్యూ!