పవర్ స్టార్ వరుసగా సినిమాలను లైన్లో పెడుతున్నారు. ఆయన లైనప్‌లో ఉన్న భారీ చిత్రమే ‘ఓజీ’. యాక్షన్ ఎంటర్టైనర్గా ప్లాన్ చేస్తున్న ఈ మూవీ నుంచి అప్‌డేట్ కోసం పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
టాలీవుడ్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ఉన్న మాస్ ఫాలోయింగ్, క్రేజ్ ఎలాంటిదో తెలిసిందే. ఆయనకు ఉన్న ఫ్యాన్ బేసే వేరు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా పవర్ స్టార్‌కు మద్దతుగా ఉంటారు అభిమానులు. ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కల్ట్ అని, వేరే లెవల్ అని సినీ విశ్లేషకులు అంటుంటారు. అయితే పవన్ సినిమాలంటే ఆయన అభిమానులే కాకుండా సాధారణ సినీ ప్రియులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. కామెడీ, మాస్, పంచ్ డైలాగులు, సిగ్నేచర్ స్టెప్ డ్యాన్సలుతో పవన్ స్క్రీన్‌పై పంచే వినోదాన్ని ఎంజాయ్ చేయడానికి అందరూ ఆతృతగా ఎదురు చూస్తుంటారు. అందుకే పవన్ వరుసబెట్టి సినిమాలు చేస్తున్నారు.
ఒకేసారి ‘హరిహర వీరమల్లు’తో పాటు మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ షూట్లోనూ పాల్గొంటున్నాడు. ఇదే క్రమంలో పవన్ ఒప్పుకున్న మరో ప్రాజెక్టు సెట్స్ మీదకు వెళ్లింది. ‘సాహో’ ఫేమ్ సుజిత్ తెరకెక్కిస్తున్న ఓజీ మూవీ షూటింగ్ నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ చిత్రీకరణను ఇవాళ మొదలుపెట్టినట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ మేరకు ఒక టీజర్ విడుదల చేసింది. ముంబైలో షూటింగ్‌ను మొదలుపెట్టామని మేకర్స్ వెల్లడించారు. టీజర్లో బాంబులు, గన్స్, గ్రెనేడ్స్, వింటేజ్ కార్లు చూస్తుంటే హాలీవుడ్ రేంజ్లో గట్టిగానే ప్లాన్ చేశాడనిపిస్తోంది సుజీత్. ఇకపోతే, ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అనే అర్థం వచ్చేలా ఈ ఫిల్మ్‌కు ఓజీ అనే టైటిల్‌ను మూవీ యూనిట్ ఫిక్స్ చేశారు. టైటిల్‌ను బట్టి మూవీ స్టోరీ గ్యాంగ్స్టర్స్, మాఫియా చుట్టూ సాగుతుందని అంటున్నారు.