పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఓజి. సోమవారం పూజా కార్యక్రమాలతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాకు సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ పూజా కార్యక్రమంలో ఈ చిత్ర హీరో పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజిత్ తో పాటు నిర్మాతలు డివివి దానయ్య దిల్ రాజు, సురేష్ బాబు, అల్లు అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ఫుల్ బ్లాక్ అవుట్ ఫిట్ లో, స్టైలిష్ హెయిర్ లుక్ లో పవన్ కళ్యాణ్ కనిపించారు. కాగా, ఈ సినిమా హీరోయిన్ ఎవరూ అనేది తెలియాల్సి ఉంది. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాత దానయ్య భావిస్తున్నారని సమాచారం.
కాగా, ఈ సినిమా ప్రకటించిన నాటి నుండే ఆసక్తి నెలకొంది. సినిమాను ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఓజి అనేది అమెరికా పదమని, దాని అర్థం ఒరిజనల్ గ్యాంగ్ స్టర్ అని తెలుస్తుంది. దీని బట్టి ఇది గ్యాంగ్ స్టర్ సినిమా అని, తమిళ రీమేక్ సినిమా అని వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ఈ పోస్టర్ పై ట్యాగ్ లైన్ లో జపనీస్ భాషలో ఫైర్ స్ట్రోమ్ కమింగ్ ( అగ్ని తుఫాను వస్తుంది) కనిపించాయి. సాహో తర్వాత సుజిత్ మరే సినిమాకు దర్శకత్వం వహించలేదు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు మొదలయ్యాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రీకరణ షూటింగ్ దశలో ఉంది.
THE MOST STYLISH MAN OF INDIAN CINEMA @PawanKalyan Arrived at #OG Pooja Ceremony!! 🔥#FireStormIsComing #PawanKalyan pic.twitter.com/3QYFnwRQ7W
— SumanTV (@SumanTvOfficial) January 30, 2023
THEY CALL HIM OG… 💥💥💥💥
AND IT BEGINS… pic.twitter.com/KpMaTpJm9A
— DVV Entertainment (@DVVMovies) January 30, 2023