పవన్ 'OG' సెట్ లో అడుగుపెట్టేశారు. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చేశారు. ఆయనతోపాటు వేసుకున్న హుడీ కాస్ట్ కూడా ఫ్యాన్స్ మధ్య డిస్కషన్ కు కారణమైంది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. టాలీవుడ్ లో ఈ పేరుకి ఓ బ్రాండ్ వాల్యూ ఉంది. హిట్ ప్లాఫ్ తో సంబంధం లేదు. ఆయన సినిమా చేసినా, బయట కనిపించినా, పొలిటికల్ స్పీచ్ ఇచ్చినా.. ఇలా ఏం చేసినా సరే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటారు. ఎప్పుడూ వార్తల్లో ఉండే పవన్ కల్యాణ్.. ప్రస్తుతం ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూ మరోవైపు వరసపెట్టి సినిమాలు కంప్లీట్ చేస్తున్నారు. తాజాగా ఆయన ‘OG’ సెట్ లో అడుగుపెట్టారు. స్టార్ హీరో షూటింగ్ కి అటెండ్ కావడం పెద్ద విషయమేం కాదులే గానీ ఆయన వేసుకున్న హుడీ ఇప్పుడు అభిమానుల్ని తెగ ఎట్రాక్ట్ చేస్తోంది.
అసలు విషయానికొస్తే.. రీసెంట్ టైంలో టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ మొదలైందనే చెప్పాలి. స్టార్ హీరోలు ఏదైనా కొత్త వస్తువులు వేసుకోవడం ఆలస్యం.. వాటి కాస్ట్ ఎంతో తెలుసుకునే ప్రయత్నం నెటిజన్స్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో అలా ఎన్టీఆర్, బాలయ్య, చిరంజీవి వాచీ కాస్ట్ చాలా ఫేమస్ టాపిక్ అయిపోయింది. అప్పుడప్పుడు పవన్ వేసుకునే హుడీ, ప్యాంట్ రేట్స్.. పవర్ స్టార్ అభిమానుల మధ్య డిస్కషన్ కి కారణమవుతుంటాయి. ఇప్పుడు ఆ లిస్టులోకి మరో కొత్త హుడీ చేరింది. దీని ఖరీదు ఎంతో తెలిస్తే.. మీరు కూడా కొనేస్తామని అంటారు.
‘సాహో’ ఫేమ్ డైరెక్టర్ సుజీత్ తీస్తున్న సినిమా ‘OG’. గ్యాంగస్టర్ డ్రామా అయిన ఈ మూవీలో పవన్.. రచ్చ లేపేపాత్రలో కనిపించబోతున్నాడు. అందులో భాగంగానే ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ అంతా పూర్తయిపోయింది. తాజాగా షూట్ చేయగా, పవన్ అటెండ్ అయ్యారు. ఇందులో భాగంగా బ్లాక్ కలర్ హుడీ వేసుకుని వచ్చారు. దీని డీటైల్స్ ఇప్పుడు అభిమానులకు తెలిసిపోయాయి. ‘మెన్స్ డన్ బ్రూక్ బ్లాక్ కమో న్యూ ఓర్లీన్స్ సెయింట్ లోగో రేంజర్ పుల్ ఓవర్ హుడీ‘ పేరుతే సెయింట్స్ ప్రో షాప్ వెబ్ సైట్ లో 60 డాలర్లకు అందుబాటులో ఉంది. మన కరెన్సీ ప్రకారం చూసుకుంటే.. దాదాపు 5 వేలు. షిప్పింగ్ కోసం మరో రూ.2,500 వేల ఛార్జ్ చేస్తారని తెలుస్తోంది. మొత్తంగా రూ.7,500 అవుతుందనమాట. అందరూ కాకపోయినప్పటికీ, మీలో కొందరైనా ఈ హుడీ కొనేయొచ్చు. మరి పవన్ హుడీ రేటుపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.