పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రేజీ రీమేక్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయ్యప్పణం కోషియం అనే ఈ రీమేక్ మూవీలో వకీల్ సాబ్ తో పాటు దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తుండగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లేతో పాటు మాటలు కూడా అందిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని సితార సంస్థ నిర్మిస్తోంది. ఇక ఇందులో భీమ్లా నాయక్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పవన్ స్టిల్స్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.
ఇక విషయం ఏంటంటే..? ఇండిపెండెంట్ రోజు కానుకగా ఈ మూవీ టైటిల్ ని విడుదల చేశారు చిత్ర యూనిట్. ఇక ఎప్పటి నుంచో ఊరిస్తున్న ఈ మూవీ టైటిల్ రానే వచ్చింది. అందరు అనుకున్నట్టుగానే ఈ సినిమా టైటిల్ ను భీమ్లా నాయక్ గా ప్రకటించారు మూవీ యూనిట్. దీంతో పాటు ఫస్ట్ గ్లిమ్స్ ను కూడా విడుదల చేసి పవన్ అభిమానులకు పండగను ప్రసాదించారు. ఇందులో పవన్ లుక్స్, స్టైల్ అదిరిపోయిందనే చెప్పాలి. తన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు పవన్ ను కొత్తగా చూపించే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారనేది చెప్పక తప్పదు. ఇక మాస్ లుక్ లో దర్శనమిస్తున్న పవన్ కళ్యాణ్ తన అభిమానుల కోరికను కాస్త తీర్చినట్టే కనిపిస్తోంది.
ఇక తాజాగా విడుదల చేసిన ఈ సినిమా గ్లిమ్స్, టైటిల్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. దీంతో మూవీపై ఇప్పటికే ఉన్న అంచనాలు మరింత పెరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సినిమాల్లో పోలీస్ పాత్రలో నటించి ప్రేక్షకుల నుంచి ఎనలేని ఆదరణను సంపాదించుకున్నాడు. ఇప్పుడు మరో సారి కూడా ఖాకి డ్రెస్ లో కనిపిస్తుండటంతో సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెరుగుతున్నట్లు తెలుస్తోంది.