పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే వార్త ఒకటి వచ్చింది. పవన్ కెరీర్‌లో మైలు రాయిగా నిలిచిన ‘తొలిప్రేమ’ సినిమా థియేటర్లలో రీరిలీజ్ కానుంది. ఈ మేరకు నిర్మాతలు ఓ ప్రకటన చేశారు.
పవన్ కల్యాణ్ నటించిన సినిమాల్లో ‘తొలిప్రేమ’ సినిమాకు ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఈ సినిమా 1990లలో ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. కలెక్షన్ల పరంగా వసూళ్ల సునామిని సృష్టించింది. యువతను ఎంతో అట్రాక్ట్ చేసిన ఈ సినిమా థియేటర్లలో రిలీజై 25 సంవత్సరాలు కాబోతోంది. ‘తొలిప్రేమ’ సినిమా 1998 జులై 24న థియేటర్లలోకి వచ్చింది. 2023 జులై 24వస్తే ఈ సినిమాకు 25 ఏళ్లు వస్తాయి. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే వార్త ఒకటి బయటకు వచ్చింది.
ఈ నెల 30న ‘తొలిప్రేమ’ సినిమాను మరోసారి విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో మునిగిపోయారు. 30వ తేదీ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కాగా, ‘తొలిప్రేమ’ సినిమాలో పవన్ కల్యాణ్, కీర్తిరెడ్డి జంటగా నటించారు. ఈ సినిమాకు దర్శకుడు ‘కరుణాకరన్’ దర్శకత్వం వహించారు. ఇది ఆయనకు తొలిసినిమా. కొత్త దర్శకుడికి సినిమా అవకాశాలు ఇవ్వటంలో ముందుండే పవన్.. కరుణాకరన్‌లోని టాలెంట్‌ను గుర్తించి అవకాశం ఇచ్చారు. తర్వాతి కాలంలో కరుణాకరన్ ఇండస్ట్రీలోనే పెద్ద దర్శకుడిగా మారారు.
ఇక, పవన్ కొత్త సినిమాల విషయానికి వస్తే.. ఆయన వరుస షూటింగులతో బిజీబిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఓజీ, భవదీయుడు భగత్‌సింగ్, ఓ తమిళ రీమేక్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాల షూటింగ్‌లు పూర్తయిన తర్వాత ఆయన ఏపీ ఎలక్షన్‌ల కోసం సిద్ధవవ్వనున్నారు. ఓ ఆరు నెలల పాటు ఆంధ్రప్రదేశ్‌లో ‘వారాహి యాత్ర’ చేయనున్నారు. మరి, పవన్ కల్యాణ్ ‘తొలిప్రేమ’ రీరిలీజ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.