ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ “భీమ్లా నాయక్”. కొంత కాలంగా పవన్ అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవర్ స్టార్, దగ్గుపాటి రానా కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ మాస్ చిత్రం ఈ రోజు(ఫిబ్రవరి 25) థియేట్రికల్ రిలీజై ప్రేక్షకుల ముందు వచ్చి ఘన విజయాన్ని అందుకుంది. అయితే.. సినిమా విడుదలకు ముందురోజు నుండే ఫ్యాన్స్ సందడి మొదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ అభిమానులు ఆయన కటౌట్ కి పాలాభిషేకం చేస్తూ, పూల దండలు వేసి సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో ఓ యువతి పవన్ కళ్యాణ్ కటౌట్ ఎక్కి పాలాభిషేకం చేసి.. పూలమాల వేసి సందడి చేసింది. దీంతో.. పవన్ ఫ్యాన్స్ ఈ యువతిని.. లేడి భీమ్లా నాయక్ అంటూ తెగ వైరల్ చేస్తున్నారు. మరి.. పవన్ కు ఉన్న ఈ ఫ్యాన్ బేస్ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.