తాజాగా పవన్- సుజిత్ కాంబోలో రాబోతున్న ఓజీ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో ఉన్న బడా నిర్మాతలు, డైరెక్టర్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఒకరి పేరు మాత్రం వైరల్ అవుతోంది. తన పాత స్నేహితుడితో చాలాకాలం గ్యాప్ తర్వాత పవన్ కలవడం ఇప్పుడు సినిమా వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఒకవైపు పవన్ ఫ్యాన్స్ కూడా వీరి కలయికను జీర్ణించుకోలేక పోతున్నారు. అతను మరెవరో కాదు రైటర్ కోన వెంకట్. అసలు వారి మధ్య ఏం జరిగింది? ఎందుకు అలా మాట్లాడుతున్నారో చూద్దాం..
రైటర్ గా కోన వెంకట్ కు చాలా మంచి పేరుంది. ఎన్నో అద్భుతమైన సినిమాలకు కోన వెంకట్ రైటర్ గా వ్యవహరించారు. అలాగే పవన్ కల్యాణ్ అంటే ఎంతో అభిమానం, పవన్ నా స్నేహితుడు అని కోన వెంకట్ చాలా సందర్భాల్లో చెప్పాడు. అలాగే వాళ్లిద్దరు మంచి మిత్రులుగా మెలిగారు. కానీ, తర్వాత కోన వెంకట్ వైసీపీలో చేరాడు. ఆ సమయంలో పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మిత్రుడని చెప్పిన పవన్ ని ప్రశ్నించడం, విమర్శించడం చూసి జీర్ణించుకోలేకపోయారు. తర్వాత వాళ్లిద్దరు కలిసిన సందర్భాలు కూడా పెద్దగా లేవు. చాలా గ్యాప్ తర్వాత ఇద్దరూ ఈ సినిమా కార్యక్రమంలో కలిసి కనిపించారు.
The #OG @PawanKalyan garu begins a new chapter with a formal Pooja Ceremony 😎
Regular shoot begins soon ❤️🔥#FireStormIsComing 🔥 #TheyCallHimOG@Sujeethsign @DVVMovies pic.twitter.com/uWQZDWcqCL
— SumanTV (@SumanTvOfficial) January 30, 2023
అయితే ఇక్కడ కోన వెంకట్ ని తప్పుపట్టడానికి లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. స్నేహం వేరు- రాజకీయ ఉద్ధేశాలు, ఆలోచనలు వేరని చెబుతున్నారు. అతను రాజకీయంగా మాత్రమే తన వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్త పరిచాడు. రాజకీయ వ్యాఖ్యలకు వ్యక్తిగత జీవితానికి ముడిపెట్టాల్సిన అవసరం లేదని చెప్పుకొస్తున్నారు. పవన్ కల్యాణ్ కూడా అతడిని మిత్రుడు అనుకున్నాడు కాబట్టే, అవి కేవలం రాజకీయ విమర్శలు అనుకున్నాడు కాబట్టే మళ్లీ దగ్గరకు తీసుకున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్- కోన వెంకట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
THE MOST STYLISH MAN OF INDIAN CINEMA @PawanKalyan Arrived at #OG Pooja Ceremony!! 🔥#FireStormIsComing #PawanKalyan pic.twitter.com/3QYFnwRQ7W
— SumanTV (@SumanTvOfficial) January 30, 2023
కోన వెంకట్ ని దగ్గరకు తీసుకోవడంపై పవన్ కల్యాణ్ ప్రశంసల వర్షం కురుస్తోంది. వద్దని వదిలి వెళ్లిపోయిన స్నేహితుడిని తిరిగి దగ్గరకు తీసుకోవడం అంటే అది పవన్ కే సాధ్యం, అలాంటి మనసు, వ్యక్తిత్వం పవన్ కు ఉన్నాయి అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంక ఓజీ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో పవన్ ఒక గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నాడు. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న యాక్షన్ డ్రామా. దీనిని పాన్ ఇండియా లెవల్లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక ఫ్యాన్ మరోసారి తన అభిమాన హీరోని తెరపైన చూపించేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే విడుదల చేసిన సినిమా పోస్టర్ తో సినిమా భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.
My Best wishes to dear Danayya garu, @DVVMovies @sujeethsign @MusicThaman & my dear friend @PawanKalyan for #OG
Wishing you nothing less than a Blockbuster 💪 pic.twitter.com/gpjDyz9Rpy— KONA VENKAT (@konavenkat99) January 30, 2023