రిపబ్లిక్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్యఅతిధిగా వచ్చిన పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నా ఒక్కడిపై ఉన్న కోపం మొత్తాన్ని చిత్ర పరిశ్రమపై చూపిస్తే ఎలా అని ప్రశ్నించారు. నా పై కోపం ఉంటే నా ఒక్కడి సినిమాలను నిలిపి వేయాలని సూచించారు. చిత్ర పరిశ్రమను ఎంతో నమ్ముకుని కొన్ని వేల మంది బతుకుతున్నారని, వారి పొట్ట కొట్టదని పవన్ తెలిపారు.
తెలుగు చిత్ర పరిశ్రమపై వైసీపీ ప్రభుత్వ తీరుమారకపోతే ఎలా మర్చాలో మాకు తెలుసన్నారు. ఇక ఇదే కాకుండా ప్రభుత్వ పేరిట పథకాలకు ప్రతీ ఒక్కరిని బలి చేసి మీరు 100 వద్ద ట్యాక్సీలు వసూలు చేసి 40 మందికి దార పోస్తామంటే మిగత 60 మంది చేతులు కట్టుకుని కూర్చుంటారా అని పవన్ ప్రశ్నించారు. ఇసుక, మద్యం, చిత్ర పరిశ్రమ ఇలా ఎన్నో రకాల వాటిపై వస్తున్న ఖాజానును చూపిస్తూ ఏపీ ప్రభుత్వం బ్యాంకుల వద్ద డబ్బులు తెచ్చుకుంటుందని అన్నారు.