అన్నయ్య.. అందరివాడు.. అభిమానుల గుండెల్లో ఖైదీ.. బాక్సాఫీస్ మగ మహారాజు.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొంది. అభిమానులు, సెలబ్రిటీలు, ప్రముఖులు అంతా మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. జనసేనాని అన్నయ్యకు తమ్ముడు పవన్ కల్యాణ్ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అన్నయ్యతో ఆయనుకున్న బంధాన్ని, అనుబంధాన్ని గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యారు.
“అన్నయ్య.. తెలుగులో బాగా ఇష్టమైన పదం. ఎందుకంటే నేను ఆరాధించే చిరంజీవి గారిని పిలవడమే కారణం కావచ్చు. ఆయన జీవితం ఒక తెరిచిన పుస్తకం. ఆయన ఇంతవాడు అంతవాడు అయిన విషయం గురించి చెప్పాలా.. ఆయన విజయాల గురించి చెప్పాలా.. ఆయన సాధించిన రికార్డుల గురించి చెప్పాలా.. ఆయన అధిరోహించిన పదవుల గురించి చెప్పాలా.. ఆయన సాధించిన కీర్తిప్రతిష్టల గురించి చెప్పాలా.. ఇవన్నీ తెలుగు వారందరితోపాటు యావత్ దేశానికి తెలుసు” అంటూ చెప్పుకొచ్చారు.
My Wholehearted Birthday wishes to my Beloved Brother whom I love ,respect & adore.. @KChiruTweets
Wishing you Good Health,Success & Glory on this special day.— Pawan Kalyan (@PawanKalyan) August 22, 2022
“దోసిట సంపాదిస్తే గుప్పెడు దానం చేయాలనే జీవన విధానం గురించి ఎంత పొగిడినా తక్కువే. పేదరికతోం బాధపడుతున్నా, అనారోగ్యంతో ఆస్పత్రి పాలైనా, చదువులకు దూరమైన వారి గురించి ఎవరి ద్వారానైనా తెలిసినా.. తక్షణం స్పందించి సాయం చేసే సహృదయుడు అన్నయ్య. కోవిడ్ టైమ్‌లో పనులు లేక సినీ కార్మికులు ఆకలితో అలమటించకుండా ఆయన చూపిన దాతృత్వం.. బ్లడ్ బ్యాంక్ స్థాపించి లక్షలాది మందితో పెట్టుకున్న రక్త సంబంధం, వేలాది గుప్త దానాలు ఇలా ఒకటి రెండు కాదు” అంటూ పవన్ కల్యాణ్ ఎమోషనల్ గా రాసుకొచ్చారు. మరి మెగాస్టార్ చిరంజీవికి కామెంట్ల రూపంలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయండి.
మనసున్న మారాజు అన్నయ్య శ్రీ @KChiruTweets గారు – JanaSena Chief Shri @PawanKalyan #HBDMegastarChiranjeevi pic.twitter.com/WV7KXxXuKV
— JanaSena Party (@JanaSenaParty) August 22, 2022