తెలుగు చిత్ర పరిశ్రమలో సినీ తారలంతా దీపావళి పండగను ఘనంగా జరుపుకున్నారు. కుటుంబ సమేతంగా కలిసి ఇంట్లో దీపావళి శోభను కళ్లారా చూశారు. అలా పండగల సందర్భంగా కొందరు నటులు ఇష్టమైన వారికి సర్ ప్రైజ్ గా బహుమతులు పంపటం మన సినిమా ఇండస్ట్రీలో కొత్తేమి కాదనే చెప్పాలి. అలా తాజాగా పవన్ కళ్యాణ్ దంపతులు మహేష్ బాబు దంపతులకు దీపావళి సందర్భంగా సర్ ప్రైజ్ గిఫ్ట్ లు పంపారు. ఇదే విషయాన్ని మహేష్ బాబు భార్య నమ్రత తన సోషల్ మీడియా వేదికగా తెలిపింది.
‘థాంక్యూ అన్నా అండ్ పవన్. హ్యాపీ దివాలీ’ అంటూ ధన్యవాదాలు తెలిపారు. అయితే పవన్ పంపిన గిఫ్ట్ లో మాత్రం రకరకాల స్వీట్లు, పర్యావరణరహిత టపాసులు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మహేష్ బాబు దంపతులకే కాకుండా డైరెక్టర్ క్రిష్, హరీష్ శంకర్ లకు కూడా దీపావళి గిఫ్ట్ లు పంపించారు. పవన్ ఇలా గతంలో అనేక మందికి ఇలా సర్ ప్రైజ్ గిఫ్ట్ లు పంపిస్తూ ఉంటారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్. హరిహర వీరమల్లు వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు.