బాల్యం ఎవరికైనా సరే ఎప్పటికీ గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం. చిన్ననాటి స్మృతులు, అప్పుడు జరిగిన సంఘటనలు ఎప్పుడు ప్రత్యేకమే. ఇక చిన్నప్పటి ఫొటోలు చూస్తే.. మనకు మనమే చిన్నపిల్లల్లా ఫీలవుతాం. ఇక అభిమాన హీరోల బాల్యంలో దిగిన ఫొటో కనిపిస్తే మాత్రం.. ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తారు. ఇప్పుడు కూడా సేమ్ అలాంటిదే జరిగింది. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ లో కొనసాగుతున్న ఓ హీరో చిన్నప్పటి పిక్ వైరల్ అయింది. ఇంతకీ ఆ హీరో ఎవరు? ఆ ఫొటో ఇప్పుడెందుకు వైరలైంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పవన్ కల్యాణ్… సోలోగా గుర్తింపు తెచ్చుకున్నారు. హిట్ ప్లాఫ్ తో సంబంధం లేకుండా ఎనలేని క్రేజ్ సంపాదించాడు.1996లో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పవన్.. నటుడిగానే కాదు డైరెక్టర్, సింగర్, రైటర్, ప్రొడ్యూసర్, యుద్ధ కళాప్రావీణ్యుడు, పొలిటికల్ లీడర్.. ఇలా చాలా రంగాల్లో తనదైన ముద్ర వేశారు. సెప్టెంబరు 2న ఆయన పుట్టినరోజు సందర్భంగా పవన్ చిన్నప్పటి ఫొటో వైరల్ గా మారింది. ఇందులో మధ్యలో ఉన్న పిల్లాడు పవన్. ఈ ఫొటో స్పెషాలిటీ ఏంటంటే.. ఇది తీసింది మెగాస్టార్ చిరంజీవి.
ఇదిలా ఉండగా అందరి హీరోలకు కేవలం అభిమానులు ఉంటే.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు మాత్రం వీరభక్తులు ఉంటారు. పవన్ పై తమకు కొలవలేనంత ప్రేమ ఉందని అంటారు. ఆయన మేనరిజమ్స్, స్టైల్ లాంటి వాటిని అనుకరిస్తుంటారు. ఇక రీఎంట్రీలో వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలతో బాక్సాఫీస్ ని షేక్ చేశారు. త్వరలో ‘హరిహర వీరమల్లు’గా రాబోతున్నారు. మరి చిన్నప్పటి ఫొటోలో పవన్ ని గుర్తుపట్టిన వాళ్లు ఎంతమంది. వాళ్లు కామెంట్ చేయండి.
ఇది కూడా చదవండి: ‘హరిహర వీరమల్లు’ పవర్ గ్లాన్స్.. చూస్తే గూస్ బంప్స్ పక్కా