సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సర్కారు వారి పాట. మే12న భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రానుంది. వెన్నెల కిశోర్, సుబ్బరాజు తదితరులు ప్రధాన పాత్రల్లో మణిశర్మ సంగీతంలో ఈ సినిమా తెరకెక్కింది. మే 2 రిలీజ్ అయిన ట్రైలర్ అందరిని ఆకట్టుకుంది. అయితే మే 7న హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈ వెంట్ మూవీ మేకర్స్ నిర్వహించనున్నారు. అయితే ఈ ఈవెంట్ కి పవర్ స్టార్ అతిథిగా రానున్నట్లు సమాచారం.
యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో భారీ ఎత్తున అభిమానులు , సినీ ప్రముఖుల మధ్య ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్ రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. చిత్ర బృందం పవన్.. ఈ వేడుకు ఆహ్వానించినట్లు సినీ వర్గాల్లో గుసగుస వినిపిస్తుంది. ఒక వేళ అదే నిజమైతే ఈ ప్రీ రిలీజ్ ఈ వెంట్ లో అటు మహేష్ ఫ్యాన్స్, ఇటు పీకే అభిమానుల కేరింతలతో దద్దరిల్లడం ఖాయం. ఇటీవలి కాలంలో తన సినిమా ఈవెంట్లకు టాలీవుడ్ స్టార్లని మహేష్ రంగంలోకి దించుతున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు మహేష్ సినిమా ఈవెంట్లకు ముఖ్య అతిధులుగా హాజరైన సంగతి అందరికి తెలిసిందే. అందుకే ఇప్పుడు సర్కారు వారి కోసం పవర్ స్టార్ పీకేని రంగంలోకి దించుతున్నట్లు ప్రచారం సాగుతోంది. మరి.. ‘సర్కారు వారి పాట’ ఈ ప్రీ రిలీజ్ ఈ వెంట్ కి పవన్ ముఖ్య అతిథిగా వస్తున్నారు అనే వార్తల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.