పవన్‌కళ్యాణ్ హీరోగా, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో మల్టీస్టారర్‌గా వస్తున్న సినిమా ‘భీమ్లా నాయక్’. అభిమానుల్లో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. అందుకు తగ్గట్టే సినిమా టీజర్, పాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి. కాగా సినిమా షూటింగ్ గ్యాప్‌లో ఈ ఇద్దరు హీరోలు ఎలా సేదతీరుతున్నారో తెలియజేస్తూ చిత్ర యూనిట్ ఒక ఫోటోను విడుదల చేసింది. అందులో పవన్ నులక మంచంపై రిలాక్స్ అవుతుండగా.. రానా ఎడ్ల బండిపై వాలిపోయారు. భారీ యాక‌్షన్ సీన్స్ తర్వాత ఇలా ఇద్దరు రెస్ట్ తీసుకుంటున్నట్లుగా ఉంది.
కాగా ఈ సినిమా సితారా ఎంటైన్మెంట్స్ బ్యానర్‌పై తెరుకెక్కుతోంది. సాగర్ కే చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మాటల మాత్రికుడు త్రివ్రికమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తున్నారు. తమన్ మ్యూజిక్ డైరెక్టర్. భీమ్లానాయక్ సంక్రాంతి బరిలో నిలవనుంది. ఈ చిత్రంలోని రెండు పాటలను ఇప్పటికే రిలీజ్ చేశారు. భీమ్లానాయక్ టైటిల్ సాంగ్ అయితే యూట్యూబ్‌ను షేక్ చేసింది. ఏకంగా కొన్ని వారాల పాటు ట్రెండింగ్ నంబర్ 1గా కొనసాగింది. అలాగే తర్వాత రిలీజ్ అయిన మెలోడీ సాంగ్ కూడా సినీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.
ఇదీ చదవండి: ఎవరీ తెలంగాణ వాగ్గేయకారుడు? ఏంటి ఈ 12 మెట్ల కిన్నెర?