మాజీ కేంద్రమంత్రి, ప్రస్తుత హర్యానా గవర్నర్ దత్తాత్రేయ గురించి అందరికీ తెలిసిందే. ఆయన ప్రతి ఏడాది దసరా పక్క రోజ ‘అలయ్ బలయ్’ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమానికి అన్నీ రంగాల నుండి ప్రముఖులు హాజరు అవుతారు. వివిధ పార్టీల రాజకీయ నాయకులు సైతం అన్నీ గొడవలను మర్చిపోయి.., ఈ ఒక్కరోజు ఆప్యాయంగా ఒకరిని ఒకరు కౌగిలంచుకుని మాట్లాడుకుంటారు. ఈసారి కూడా ‘అలయ్ బలయ్’ కార్యక్రమం ఇదే రీతిలో జరిగింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఇక ఈ వేడుకకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మా అధ్యక్షుడు మంచు విష్ణుని సైతం ఆహ్వానించారు. కానీ.., ఇక్కడ కూడా ‘మా’ మంటలు కొనసాగాయి.
జనసేన అధినేత పవన్, ‘మా’ న్యూ ప్రెసిడెంట్ విష్ణు స్టేజ్‌పై ఒకరికొకరు ఎదురుపడ్డా మాట్లాడుకోలేదు. వేదికపైనే కూర్చున్నా ఒకరిమొహం ఒకరు చూసుకోలేదు. ఇక అదే స్టేజ్‌పై పవన్, విష్ణు మెమొంటోలు తీసుకున్నారు. అప్పుడు కూడా ఎడమొహం..పెడమొహంగా ఉండిపోయారు. ఇద్దరి మధ్య కనీసం చిరు నవ్వు కూడా ఎక్సేంజ్ అవ్వలేదు. దీంతో.. మా ఎన్నికల వివాదం ఈ రెండు కుటుంబాలను ఎంత దూరం చేసిందో అర్ధం అయ్యింది. అయితే.., తరువాత విష్ణు మాత్రం పవన్ కళ్యాణ్ ఉన్న వీడియోని పోస్ట్ చేసి, ఈయన ఎవరో గుర్తు పట్టారా అంటూ ఓ వీడియో పోస్ట్ చేయడం విశేషం. మరి.. ఒకే వేదికను పంచుకున్న ఇద్దరు హీరోలు కనీసం మాట్లాడుకోకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిజేయండి.