Pawan Kalyan: ప్రముఖ స్టార్ హీరో, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణంరాజు కుటుంబానికి తన తరపున, జనసేన ప్రక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో.. ‘‘ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక పంథాను కలిగిన నటులు శ్రీ కృష్ణంరాజు గారు. రౌద్ర రస ప్రధానమైన పాత్రలను ఎంతగా మెప్పించేవారో కరుణ రసంతో కూడిన పాత్రల్లోనూ అలాగే ఒదిగిపోయేవారు. నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా అందరి మన్ననలు పొందిన శ్రీ కృష్ణంరాజు గారు తుదిశ్వాస విడిచారనే వార్త దిగ్భ్రాంతి కలిగించింది.
ఇటీవలి కాలంలో ఆయన అస్వస్థతకు లోనయ్యారని తెలిసినపుడు కోలుకుంటారని భావించాను. శ్రీ కృష్ణంరాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. మా కుటుంబంతో శ్రీ కృష్ణంరాజు గారికి స్నేహబంధాలు ఉన్నాయి. 1978లో ‘మన వూరి పాండవులు’ చిత్రంలో శ్రీ కృష్ణంరాజుగారితో కలిసి అన్నయ్య శ్రీ చిరంజీవిగారు నటించారు. మొగల్తూరు గ్రామవాసులు కావడంతో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. ‘భక్త కన్నప్ప’లో శ్రీ కృష్ణంరాజు గారి అభినయం ప్రత్యేకం. అందులో శివ భక్తిని చాటే సన్నివేశాలను రక్తి కట్టించారు.
బొబ్బిలి బ్రహ్మన్న, అమరదీపం, తాండ్ర పాపారాయుడు, మహ్మద్ బిన్ తుగ్లక్, పల్నాటి పౌరుషం లాంటి చిత్రాలు ఆయన శైలి నటనను చూపాయి. ప్రజా జీవితంలోనూ ఆయన ఎంతో హుందాగా మెలిగారు. కేంద్ర మంత్రిగా సేవలందించారు. ప్రజారాజ్యంలో క్రియాశీలకంగా ఉంటూ పార్టీ తరపున బరిలో నిలిచారు. సినీ జీవితంలోనూ, ప్రజా జీవితంలోనూ ఎంతో బాధ్యతాయుతంగా వారు అందించిన సేవలు మరువలేనివి. శ్రీ కృష్ణంరాజు గారి కుటుంబానికి నా తరపున, జనసేన ప్రక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని పేర్కొన్నారు. మరి, కృష్ణంరాజు మరణంపై పవన్ కల్యాణ్ విడుదల చేసిన ప్రకటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
శ్రీ కృష్ణంరాజు గారి మరణం దిగ్భ్రాంతికరం – పవన్ కళ్యాణ్ @PawanKalyan Garu#RIPKrishnamRajuGaru #KrishnamRaju #RIPKrishnamRaju pic.twitter.com/J9Xyyg9LkK
— SumanTV (@SumanTvOfficial) September 11, 2022
ఇవి కూడా చదవండి : Krishnam Raju: కృష్ణంరాజుకి రెబల్ స్టార్ అనే బిరుదు ఎలా వచ్చిందంటే?