గత కొన్ని రోజుల నుంచి తెలుగు, కన్నడ మీడియాలో పవిత్రా లోకేష్, నటుడు నరేష్, రమ్య రఘపతి వ్యవహారం కాస్త కాంట్రవర్సీగా మారిన విషయం తెలిసిందే. దీనిపై నరేష్, రమ్య ఒకరిపై ఒకరు మాటల, తూటలు పేల్చుుకుంటున్నారు. మధ్యలో పవిత్ర లోకేష్ సైతం స్పందిస్తున్నారు. అయితే ఆదివారం మైసూర్ లో నరేశ్ , పవిత్ర లోకేశ్ హోటల్ లో ఉండగా రమ్య అక్కడి చేరుకున్నారు. దీంతో హోటల్ నుంచి బయటకు వెళ్తున్న నరేశ్, పవిత్రలను అడ్డుకునే ప్రయత్నం చేశారు రమ్య. ఆ క్రమంలో చెప్పుతో పవిత్రా లోకేశ్ కొట్టే ప్రయత్నం కూడా చేశారు. వెంటనే గమనించిన పోలీసులు ఆమెను పోలీసులు బయటకు పంపేశారు. ఈక్రమంలో మీడియాలో వస్తున్న నరేష్, పవిత్రల వార్తలపై తాజాగా పవిత్ర మాజీ భర్త సుచేంద్ర ప్రసాద్ స్పందించారు.
సుచేంద్ర ప్రసాద్ మాట్లాడుతుూ..”ఈ వ్యవహారంతో నాకు సంబంధంలేదు. నన్ను అడిగితే నాకేమి తెలుస్తుంది. అడగాలనుకుంటే వారినే అడగండి.అన్నిటి కాలమే నిర్ణయిస్తుంది” అని అన్నారు. రాకేశ్ శెట్టి తెలుసా? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు.. ఆ రాకేశ్ శెట్టి ఎవరో తనకు తెలీదని సమాధానం ఇచ్చారు. తన భార్య పై వస్తున్న వార్తలను మీడియా, కొంతమంది స్నేహితుల ద్వారా తెలుసుకున్నానని సుచేంద్ర ప్రసాద్ తెలిపారు. పవిత్ర లోకేష్ మాజీ భర్త తెలిపిన మరిన్ని విషయాల కోసం ఈ క్రింది వీడియోను వీక్షించండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.