కృష్ణ, విజయనిర్మల ఆశీస్సులు తమ జంటకు ఎప్పుటికీ ఉంటాయని పవిత్రా లోకేష్ అన్నారు. నరేష్‌తో కలసి తాను నటించిన ‘మళ్లీ పెళ్లి’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
టాలీవుడ్లో ఈ మధ్య కాలంలో బాగా ఆసక్తి రేకెత్తించిన సినిమాల్లో ఒకటి ‘మళ్లీ పెళ్లి’. నరేష్-పవిత్ర లోకేష్ వ్యవహారం తెలిసిన వాళ్లు ఈ మూవీ కోసం చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ ఫిల్మ్ నుంచి ఇప్పటికే విడుదలైన పలు గ్లింప్స్ వీడియోలు ఆడియెన్స్ నుంచి మంచి ఇంప్రెషన్ తీసుకున్నాయి. తాజాగా ‘మళ్లీ పెళ్లి’ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఇందులో నరేష్-పవిత్ర బంధంతో పాటు సూపర్ స్టార్ కృష్ణ ఇంటి వ్యవహారాలను కూడా చూపించడం హాట్ టాపిక్‌గా మారింది. కాగా, ఈ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా పవిత్ర లోకేష్ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తమకు కృష్ణ, విజయనిర్మల ఆశీర్వాదం ఎప్పటికీ ఉంటుందన్నారు.
విజయకృష్ణ మూవీస్‌ను రీలాంఛ్ చేయడం శుభపరిణామమని పవిత్ర లోకేష్ అన్నారు. దీనికి తెలుగువాళ్లందరూ గర్వపడతారని.. ఈ బ్యానర్‌పై ఎన్నో మంచి సినిమాలు తెరకెక్కాయని ఆమె చెప్పారు. తమ జంటకు కృష్ణ, విజయనిర్మల ఆశీస్సులు ఉంటాయన్నారామె. ‘మళ్లీ పెళ్లి’ దర్శకుడు ఎంఎస్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని.. ఆయన ప్రతిభ ఏంటనేది అందరికీ తెలుసునని పవిత్ర లోకేష్ పేర్కొన్నారు. ఇలాంటి దర్శకుడితో కలసి పనిచేయడం వల్ల ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చన్నారామె. తనకు కావాల్సిన ఔట్‌పుట్‌ను ఎంతో ఓపికతో నటుల నుంచి తీసుకోవడం ఎంఎస్ రాజు ప్రత్యేకత అని పవిత్ర మెచ్చుకున్నారు. ‘మళ్లీ పెళ్లి’ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.