తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు పవిత్రా లోకేష్. కన్నడ సినిమాలతో తన కెరీర్‌ను మొదలుపెట్టిన ఆమె తెలుగులోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం పవిత్రా లోకేష్‌కు సంబంధించిన ఓ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఆమె తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాలు వెల్లడించారు. అంతేకాదు! సినిమా ఇండస్ట్రీలో తనకు ఇష్టమైన హీరో గురించి కూడా చెప్పారు. తెలుగు పరిశ్రమకు చెందిన ఓ టాప్ హీరో తనకు మొదటి క్రష్ అని ఆమె చెప్పారు.
ఆ హీరో ఎవరో కాదు.. టాలీవుడ్ కింగ్ నాగార్జున. గతంలో ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె నాగార్జున గురించి మాట్లాడారు. ఆయన తన మొదటి క్రష్ అని చెప్పుకొచ్చారు. ఆమె మాట్లాడుతూ.. ‘‘ నాగార్జున గారిని కలిశాను. కానీ, మాట్లాడలేదు. అంత ధైర్యం లేదు నాకు. నేను ఆరవ తరగతో ఏడవ తరగతో చదువుతున్నపుడు గీతాంజలి సినిమా చూశాను. అప్పుడు ఓ ఫీలింగ్ ఉంటుంది కదా.. ఇలాంటి మ్యాన్ ఉండాలి మా లైఫ్‌లో అని. ఆ!! క్రష్. నాగార్జున గారిని చూస్తే నాకు అలా ఉంది. రెండు, మూడు సార్లు నేను ఆయన్ని కలిశాను. కానీ, మాట్లాడలేకపోయాను.
ఆయన నా ఫస్ట్ క్రష్. ఆ తర్వాత ప్రకాశ్ రాజ్ గారు నా సెకండ్ క్రష్. ఆయనతో కలిసి చాలా సినిమాలు చేశాను. ఎప్పుడూ ఆయనకు దూరంగా కూర్చునే దాన్ని. కానీ, ఆయనే నన్ను దగ్గరకు పిలిచి మాట్లాడేవారు’’ అని చెప్పుకొచ్చారు. కాగా, పవిత్రా లోకేష్ తన పారితోషికాన్ని భారీగా పెంచేసిందట. కొన్ని నెలల క్రితం వరకు రోజుకు 60 వేల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకునేదట. కానీ, ఇప్పుడు ఏకంగా లక్ష రూపాయల వరకు డిమాండ్ చేస్తోందనే టాక్ వినిపిస్తోంది. ఇక, పవిత్రా లోకేష్ పారితోషికం వార్త సోషల్ మీడియాలో, సినీ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. మరి, ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలియాలంటే పవిత్ర స్పందించాల్సిందే.