ప్రముఖ నటి పవిత్ర లక్ష్మి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆ విషాదంపై ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో ఈ విధంగా ఉంది. ఆ పోస్టులో ఈ విధంగా ఉంది.
గత కొద్దిరోజులనుంచి చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రముఖ నటులే కాదు.. బుల్లితెరకు సంబంధించిన వారి కుటుంబాల్లో కూడా మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా, ప్రముఖ తెలుగు బుల్లితెర నటుడు ముఖేష్ గౌడ ఇంట్లో కూడా విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి మరణించారు. ఈ సంఘటన మరువక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రముఖ తమిళ నటి పవిత్ర లక్ష్మి ఇంట్లో కూడా విషాదం చోటుచేసుకుంది. ఆమె తల్లి కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె 7 రోజుల క్రితం చనిపోయారు. ఈ విషయాన్ని పవిత్ర లక్ష్మి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు.
ఆమె తన పోస్టులో.. ‘‘ 7 రోజులు అయింది. నేను ఈ బాధల్లోంచి బయటపడాలని చూస్తున్నా.. నువ్వు నన్ను విడిచి వెళ్లిపోయి వారం రోజులు అవుతోంది. నువ్వు నన్ను ఎందుకింత త్వరగా వదిలి వెళ్లిపోయావో నాకు అర్థం కావటం లేదు. దాదాపు 5 ఏళ్లుగా నువ్వు అనుభవించిన కష్టాలు, బాధలు.. నువ్వు ప్రస్తుతం ఉన్న చోటులో ఉండవని అనుకుంటున్నాను. నువ్వో అద్భుతమైన తల్లివి. సింగిల్ పేరెంట్‌గా ఉంటూ బిడ్డల్ని చూసుకోవటం సాధారణ విషయం కాదు. నాకు నిన్ను ఓ సారి చూడాలని ఉంది. నీతో ఓ సారి మాట్లాడాలని ఉంది. నీ చేతి ముద్ద తినాలని ఉంది.
కానీ, నాకా అవకాశం లేదు. నువ్వు ఎప్పటికీ నావైపు ఉంటావని అనుకుంటున్నాను. ఈ కష్టకాలంలో నాతో ఉన్నవారందరికీ నా ధన్యవాదాలు. నేను కొన్ని కాల్స్, మెసేజ్‌లకు రిప్లై ఇవ్వలేకపోయాను. క్షమించండి. నేను ఇందులోంచి బయటపడ్డానికి చూస్తున్నాను. నేను త్వరలో మీ టచ్‌లోకి వస్తాను’’ అని పేర్కొన్నారు. మరి, తల్లి మరణంపై పవిత్ర లక్ష్మి పెట్టిన ఎమోషనల్ పోస్టుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.