మెగా స్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో కొరటాల శివ తెరకెక్కించిన భారీ చిత్రం ఆచార్య. ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ జతగా పూజాహెగ్డే నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్ జోరు పెంచేశాయి. ఇప్పటికే మూవీ యూనిట్ విడుదల చేసిన సాంగ్స్, టీజర్, ట్రైలర్‌లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఇంక చిరు- చెర్రీ కలిసి స్టెప్పులేసిన బంజారా సాంగ్ ప్రోమో యూట్యూబ్ సెన్సేషన్ గా మారింది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఏప్రిల్ 23న ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు అని తెలిసిందే. అయితే ఈవెంట్ కి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిధిగా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఈ వార్త తెగ చక్కర్లు కొడుతోంది.
ఇదీ చదవండి: అప్పుల ఊబిలో ఉన్న రైతులను ప్రభుత్వమే రక్షించాలి : పవన్ కళ్యాన్
ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సీఎం జగన్ వస్తారని భావించి ఈ నెల 23వ తేదీన విజయవాడలో ఏర్పాట్లు చేయాలని చిత్ర యూనిట్ భావించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈ వెంట్ కు సీఎం జగన్ హాజరుకాలేక పోతుండటంతో చిత్ర యూనిట్ వేదిక మార్చుకున్నట్లు టాక్. కొత్త వేదిక హైదరాబాద్ లోని యూసఫ్ గూడలో పోలీస్ పరేడ్ గౌండ్ లో నిర్వహించనున్నది.అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ తో పాటు మరో అతిథిగా రాజమౌళి రానున్నట్లు సమాచారం. ఈ వార్తల్లో ఎంత వరకు నిజమో తెలియదు కానీ.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్బంగా ఒకే వేదికపై మెగాస్టార్, పవర్ స్టార్ మరియు మెగా పవర్ స్టార్ సందడి ప్రేక్షకులకు కన్నుల పండగే. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయలాను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.