పవన్ కల్యాణ్ 50వ పుట్టినరోజు ఫ్యాన్స్‌కు నిజమైన పండగగా గుర్తుంటుంది. ఇప్పటికే ‘భీమ్లానాయక్’, ‘హరిహర వీరమల్లు’ అప్‌డేట్స్‌తో జోరు మీదున్న ఫ్యాన్స్‌కు హరీశ్ శంకర్ కూడా మరో ట్రీట్ ఇచ్చేశాడు. ‘దిస్ టైమ్ నాట్ జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్’ అంటూ పవన్ 28వ ప్రాజెక్టు నుంచి ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశాడు హరీశ్‌శంకర్. ఇండియాగేట్ ఎదుట హార్లీ డేవిడ్‌సన్ బైక్‌పై కూర్చున్న పవన్ కల్యాణ్ పోస్టర్ బాగా ఆకట్టుకుంటోంది.
ఈ సినిమాని హరీష్ శంకర్ రాజకీయాల అంశాలు, దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు, ఈ సినిమా మొత్తం దాదాపు పవన్ కల్యాణ్ నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉండబోతోందని టాక్. తండ్రి, కొడుకు పాత్రలు రెండూ పవన్‌నే చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక అధ్యాపకుడి నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన క్రమమే స్టోరీగా ఉండబోతోందని సమాచారం.
పవన్ 28వ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ డీఎస్పీ అందించనున్నాడు. ఈసినిమాకి ఆర్ట్ డైరెక్ట్ర్‌గా పవన్ మిత్రుడు ఆనంద్‌సాయి వ్యవహరిస్తున్నాడు. స్టంట్స్ రామ్- లక్షణ్, డీవోపీగా చోటా కె ప్రసాద్ చేయనున్నారు.