బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్‘ మూవీ బాక్సాఫీస్ ని ఊపేస్తోంది. రిలీజైన మొదటి షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా.. కలెక్షన్స్ లో కొత్త రికార్డులు సెట్ చేస్తోంది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషలలో జనవరి 25న పఠాన్ రిలీజ్ అయ్యింది. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సాలిడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని యశ్ రాజ్ ఫిలిమ్స్ పై ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్ తో నిర్మించారు. దీపికా పదుకొనే, జాన్ అబ్రహం కీలకపాత్రలలో నటించారు. రిలీజ్ ముందే పలు వివాదాలతో హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా.. ట్రైలర్ తో అంచనాలు భారీగా పెంచేసింది.
కొన్నాళ్లుగా సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న షారుఖ్ కి, అతని ఫ్యాన్స్ కి ఊపునిచ్చింది పఠాన్. మొదటి షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ తో పాటు అద్భుతమైన కలెక్షన్స్ రికార్డులు నెలకొల్పింది. మొదటి రోజు రూ. 106 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ వసూల్ చేసిన ఈ సినిమా.. రెండో రోజు కూడా అదే రోజును కొనసాగించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొదటి రోజు బాలీవుడ్ లో రూ. 56 కోట్ల నెట్ కలెక్షన్స్ తో ‘కేజీఎఫ్ 2’ పేరిట ఉన్న రూ. 54 కోట్ల రికార్డుని బ్రేక్ చేసింది. అలాగే తెలుగు, తమిళ భాషలలో సుమారు రూ. 6 కోట్ల నెట్ వసూల్ అయినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఫస్ట్ డే పఠాన్ కలెక్షన్స్ రూ. 57 – 60 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూల్ అయ్యాయి.
ఇక రెండో రోజు చూసుకుంటే.. రిపబ్లిక్ డే హాలిడే కలిసి రావడంతో పఠాన్ కి కలెక్షన్స్ వెల్లువెత్తాయి. విడుదలైన అన్ని చోట్లా అన్ని షోస్ హౌస్ ఫుల్ కావడంతో రెండో రోజుతో పఠాన్.. రూ. 200 కోట్ల క్లబ్ లో చేరి షారుఖ్ సత్తాని చాటింది. సెకండ్ డే కూడా పఠాన్ మూవీకి రూ. 100 కోట్లకు పైనే గ్రాస్(రూ. 70 కోట్ల వరకు నెట్) కలెక్ట్ అయ్యిందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ సినిమాకి దాదాపు రూ. 250 – 260 కోట్లు మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. ఈ వీకెండ్ వరకు పఠాన్ రూ. 400 కోట్లు వసూల్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరి స్పై థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో ఫ్యాన్స్ మెచ్చే ఎన్నో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో పఠాన్ కలెక్షన్స్ వివరాలు తెలియాల్సి ఉంది. మరి పఠాన్ మూవీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#Pathaan creates History (for Hindi Cinema) by scoring ₹72 Cr Day 2 (Holiday) NBOC in India including all languages. No Hindi Based Movie ever has collected even ₹60 Cr In a single Day before! Total ₹127 Cr+ Nett. WW GBOC crosses ₹200 Cr.
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) January 27, 2023