జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రవీణ్ అలియాస్ పటాస్ ప్రవీణ్. తాజాగా పెళ్లి చేసుకుని అందరికి షాక్ ఇచ్చాడు ప్రవీణ్. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరలవుతోంది. ఆ వివరాలు..
ఈటీవీలో ప్రసారం అవుతోన్న జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎందరో కొత్త కమెడియన్‌లు తెలుగు తెరకు పరిచయం అయ్యారు. వీరిలో చాలా మంది తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని.. బుల్లితెర మీద రాణిస్తున్నారు. చాలా మంది సినిమాలో కమెడియన్‌లుగా మాత్రమే కాక హీరోలుగా మారారు. ఇక జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్‌లలో పటాస్ ప్రవీణ్ ఒకరు. ఫైమా, ప్రవీణ్ జోడిగా బుల్లి తెర మీద నవ్వులు పూయించారు. రీల్ మీద మాత్రం వీరద్దరిని లవర్స్‌గానే చూపించారు. కొన్నాళ్ల పాటు పలు షోలలో వీరి లవ్ ట్రాక్‌ని టెలికాస్ట్ చేశారు. టీవీ స్క్రీన్ మీద వీరు వేసే వేషాలు చూస్తే.. వాళు నిజంగా లవర్లో కారో తేల్చుకోవడం చాలా కష్టం. ప్రస్తుతానికి ఫైమా, ప్రవీణ్ ఇద్దరు లవర్స్ అనే టాక్ వినిపిస్తోంది. వీరిద్దరి గురించి ఇలాంటి ప్రచారం ఉండగానే.. తాజాగా పెళ్లి చేసుకుని అందరికి షాక్ ఇచ్చాడు ప్రవీణ్. ఆ వివరాలు..
ఈ వార్త వినగానే.. ఫైమాను లవ్ చేసిన ప్రవీణ్.. ఇలా ఉన్నట్లుండి మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజనులు. ఇందుకు ఫైమా ఎలా ఒప్పుకుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఇక్కడో విషయం ఉంది. అది ఏంటంటే.. ప్రవీణ్ పెళ్లి చేసుకుంది నిజ జీవితంలో కాదు. ఓ యూట్యూబ్ చానెల్ కోసం ఇలా పెళ్లి కొడుకుగా మారాడు. జబర్దస్త్ కమెడియన్ కొమరం కోసం ప్రవీణ్ ఇలా పెళ్లి కొడుకుగా మారాడని సమాచారం. ఈ పెళ్లి వెనుకు కథ తెలియాలంటే వీడియో వచ్చే వరకు ఆగాలి అంటున్నారు. అయితే తొలుత ఈ వీడియో చూసిన వారు నిజంగానే ప్రవీణ్ పెళ్లి చేసుకున్నాడేమో అని భావించారు. దాంతో ఫైమాను వదిలేశావా.. ఈ అమ్మాయి ఎవరు.. ఎలా పరిచయం అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
కానీ ఈ పెళ్లి వీడియోపై ప్రవీణ్ క్లారిటీ ఇవ్వడంతో.. అసలు విషయం తెర మీదకు వచ్చింది. కొమరక్క యూట్యూబ్ చానెల్ కోసం ఇలా చేసినట్లు.. త్వరలోనే ఈ ఎపిసోడ్.. కొమరక్క చానెల్‌లో వస్తుందని తెలిపాడు. అయితే దీనిపై పలువురు నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీకు పెళ్లి అంటే అంత ఆటలుగా కనిపిస్తోందా.. పెళ్లికి సంబంధించి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రాంక్‌లు, వీడియోలు చేసి.. పెళ్లికి ఉన్న పరువు తీయకండి అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ప్రవీణ్ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.