జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన లేడీ కమెడియన్స్ లో ఫైమా ఒకరు. జబర్దస్త్ తో పాటు స్పెషల్ ఈవెంట్స్ లోను తన కామెడీ టైమింగ్ తో బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఫైమా.. ఫామ్ లో ఉండగానే బిగ్ బాస్ రియాలిటీ షోలో అవకాశం దక్కించుకుంది. బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొన్న తర్వాత ఫైమా క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి. హౌస్ లో ఎంతో చురుకుగా అన్ని యాక్టివిటీస్ లో పాల్గొని.. అందులో ఉన్నవాళ్లందరికి స్ట్రాంగ్ పోటీ ఇచ్చింది. అలాగే చివరివరకు ఏమాత్రం జంకకుండా తనను తాను ప్రూవ్ చేసుకుని నిలబడింది. ఇక రీసెంట్ గా జరిగిన ఎలిమినేషన్స్ లో ఫైమా ఎలిమినేట్ అయిపోయింది.
బిగ్ బాస్ నుండి బయటికి రాగానే ఆమె ఫ్యాన్స్, కుటుంబ సభ్యులు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన ఫైమా.. బిగ్ బాస్ లో ఉన్నన్ని రోజులు తనకు సపోర్ట్ చేసిన ఫాలోయర్స్ కి, ఆడియెన్స్ కి థాంక్స్ తెలిపింది. ఇక పటాస్ నుండి జబర్దస్త్.. బిగ్ బాస్ హౌస్ వరకు ఫైమా లైఫ్ జర్నీ అందరిని ఇన్స్పైర్ చేస్తోంది. కాగా, హౌస్ లో అందరితోను బాగానే ఉన్న ఫైమా.. సింగర్ రేవంత్ ని మాత్రం అల్లాడించేసింది. నిరుపేద కుటుంబం నుండి ఈ స్థాయికి వచ్చిన ఫైమా.. తన తల్లికి, ఫ్యామిలీకి సాయం చేస్తూ.. కెరీర్ ప్రారంభించింది.
ఇక ఫైమా బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చాక ఆమెకు ఫ్యామిలీ నుండి గ్రాండ్ వెల్కమ్ లభించింది. కానీ, ఫ్యామిలీ కంటే గ్రాండ్ వెల్కమ్ పలికాడు ఫైమా ప్రియుడు పటాస్ ప్రవీణ్. పటాస్ నుండి ఫైమాతో ట్రావెల్ చేస్తున్న ప్రవీణ్.. జబర్దస్త్ లో కూడా ఆమెకు జోడిగానే స్కిట్స్ చేస్తూ ఫేమ్ తెచ్చుకున్నాడు. అలాగే ఇద్దరి మధ్య మంచి స్నేహం నుండి.. లవ్ లో పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఫైమా హౌస్ నుండి బయటికి రాగానే ప్రవీణ్ వెల్కమ్ చెబుతూ.. తన మెడలో ఉన్న గోల్డ్ చైన్ ని ఫైమాకి స్పెషల్ గిఫ్ట్ గా ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పైగా ప్రవీణ్ గిఫ్ట్ ఇచ్చిన వీడియోని తన యూట్యూబ్ ఛానల్ లో రిలీజ్ చేసింది ఫైమా. ప్రస్తుతం ఈ జంట పక్షుల వీడియో నెట్టింట తెగవైరల్ అవుతోంది .