ప్రముఖ తమిళ హీరోయిన్ పార్వతి నాయర్‌కు ఆమె ఇంట్లో పని చేసే వ్యక్తి సుభాష్‌కు మధ్య గత కొద్దిరోజులుగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. తన ఇంట్లో ఖరీదైన వస్తువులు పోయాయని పార్వతి కంప్లైంట్ ఇచ్చిన నాటి నుంచి ఈ వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలోనే కొద్దిరోజుల క్రితం సుభాష్ మీడియా ముందుకు వచ్చాడు. పార్వతిపై సంచలన ఆరోపణలు చేశాడు. ఆమె ఇంట్లోకి రాత్రిళ్లు ఎవరెవరో వస్తున్నారని ఆరోపించాడు. ఇది చూసిన కారణంగానే తనపై ఆమె కంప్లైంట్ ఇచ్చిందని అన్నాడు. ఈ నేపథ్యంలోనే తన పని మనిషి సుభాష్ చేస్తున్న ఆరోపణలపై పార్వతి తాజాగా మీడియాతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్వతి మీడియాతో మట్లాడుతూ.. ‘‘ అక్టోబర్ నెలలో మా ఇంట్లో ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు కొన్ని పోయాయి.
నేను అప్పుడు ఇంట్లో లేను. షూటింగ్‌లో ఉన్నాను. వస్తువులు కనిపించకపోయే సరికి కంప్లైంట్ ఇచ్చాను. ఇంట్లో పని చేసే వాళ్ల పేర్లు కావాలని పోలీసులు అడిగారు. నేను అందరి పేర్లు పోలీసులకు ఇచ్చాను. ఎవరిమీదైనా ఎక్కువ అనుమానం ఉందా అని పోలీసులు అడిగారు. వీకెండ్‌లో ఇంట్లో ఉన్నది సుభాష్ చంద్రబోస్ కాబట్టి అతడి పేరు చెప్పాను. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు స్టాఫ్ అందరినీ పిలిచి ఎంక్వైరీ చేశారు. కానీ, సుభాస్ ఒక్కడిని చేయలేదు. అతడు ఎంక్వైరీకి కోపరేట్ చేయటం లేదు. అంతేకాదు! నన్ను బ్లాక్ మెయిల్ చేయటం మొదలుపెట్టాడు. కంప్లైంట్ వెనక్కు తీసుకోకపోతే చచ్చిపోతానని అన్నాడు. మొదట్లో నేను భయపడ్డాను. తర్వాత అతడి మాటలు పట్టించుకోలేదు. ఎవ్వరికీ లేని ఇబ్బంది అతడికి మాత్రమే ఎందుకు వస్తోంది.
తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నాడు అనుకున్నాడు. నవంబర్ 10 లేదా 11 సమయంలో అతడు ఓ ప్రెస్ మీట్ పెట్టాడు. నా పరువుకు నష్టం కలిగించేలా మాట్లాడాడు. నేను పరువు నష్టం దావా కూడా వేశాను. అతడు చెప్పిన ప్రతీ విషయం ఓ అబద్ధం. అతడు ఆ కేసును తప్పుదోవ పట్టించటానికి ఇలా చేశాడు. అతడు తప్పు చేశాడని నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. కానీ, నేను చట్టప్రకారం ముందుకు వెళ్లాలని చూస్తున్నాను. అతడు ఓ అనాథ అని నాకు మొదట్లో చెప్పాడు. ఇప్పుడు మాత్రం అతడి తమ్ముడు అని, అన్న అని అతడి వాళ్లు నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. నాకు చాలా బాధగా ఉంది. నేను పని చేస్తున్న ప్రొడక్షన్ వాళ్లు నన్ను అడుగుతున్నారు. ఇది నన్ను మానసికంగా ఇబ్బంది పెడుతోంది’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
#Watch | “மிரட்டல்களாலும், தேவையற்ற வதந்திகளாலும் என் சினிமா வாழ்க்கையை அழிக்க முயற்சிக்கிறார்கள்”
– சென்னை காவல் ஆணையர் அலுவலகத்தில் புகார் அளித்தப்பின் நடிகை பார்வதி செய்தியாளர்கள் சந்திப்பு!#SunNews | #ActressParvathi | #TNPolice pic.twitter.com/21HyBNdqJb
— Sun News (@sunnewstamil) November 26, 2022