వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా.. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్‌లుగా తెరకెక్కిన చిత్రం ఎఫ్3. గతంలో వచ్చిన F2 ఫ్రాంచైజీలో భాగంగా ఎఫ్3 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే F2తో పోలిస్తే.. ఎఫ్3 ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఎఫ్3 సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మరీ ముఖ్యంగా వెంటకేష్‌ని ఉద్దేశిస్తూ.. అసలు ఈ సినిమా ఎలా ఒప్పుకున్నారు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాజాగా ఎఫ్3 సినిమా, వెంకటేష్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి. ఆ వివరాలు..
పరుచూరి గోపాల కృష్ణ గత కొంత కాలం నుంచి పరుచూరి పలుకులు పేరుతో సినిమాలు, తారలకు సంబంధించి విశేషాలు, అలనాటి సినిమాలకు సంబంధించిన జ్ఞాపకాలతో పాటు.. ప్రస్తుతం వస్తున్న సినిమాల మీద కూడా తనదైన శైలీలో కామెంట్స్ చేస్తున్నారు. ఈక్రమంలో తాజాగా ఆయన ఎఫ్3 సినిమాను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు వెంకటేష్ ఈ సినిమాను ఎందుకు అంగీకరించాడో తనకు అర్థం కాలేదని అన్నాడు. అంతేకాక ఎఫ్2లో ఉన్న సోల్.. ఎఫ్3లో లేదన్నాడు. అంతేకాక సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.