Paruchuri Gopala Krishna: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా.. మే 12న ప్రేక్షకుల ముందుకొచ్చి అద్భుతమైన వసూళ్లను రాబట్టి రూ. 200 కోట్ల క్లబ్ లో చేరింది. బ్యాంకింగ్ రంగంలో వేలకోట్ల రుణాలు ఎగ్గొట్టిన బడాబాబులపై రూపొందిన ఈ సినిమా మహేష్ అభిమానులను ఆకట్టుకుంది.
తాజాగా ‘సర్కారు వారి పాట’ పై సీనియర్ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని చెబుతూనే, చిన్నచిన్న మార్పులు చేసి ఉంటే మూవీ మరింత బాగుండేదని అన్నారు. ఆయన మాట్లాడుతూ.. “ఈ సినిమా టైటిల్ చూడగానే.. సర్కారు వారి పాట వలన ఏదో ఘోరం జరిగి ఉంటుందని ఓపెనింగ్ లోనే అర్థమవుతుంది. నిజానికి ఈ టైటిల్ కంటే.. మోడ్రన్ గా ఆ రోజుల్లో దేశద్రోహులు లాంటి టైటిల్స్ పెట్టేవాళ్లం.
రూ.15 వేల అప్పు తీర్చలేక తల్లిదండ్రులు ప్రాణాలు తీసుకుంటే.. వాళ్ల బిడ్డ అమెరికాకు వెళ్లి తిరిగి అప్పులు ఇచ్చే స్థాయికి ఎదిగాడు. ఫస్టాఫ్ లో హీరో, హీరోయిన్ల మధ్య కామెడీ సీన్లు చాలా బాగున్నాయి. మొదటి 15 నిమిషాలు సినిమా చూస్తుంటే.. ఇలానే సాగితే అద్భుతంగా ఉంటుందని అనిపిస్తుంది. కానీ సడెన్ గా ఛేంజ్ ఓవర్ ఆఫ్ ది ఫిల్మ్ అయిపోయింది.
కీర్తి సురేష్ పాత్రతో అమెరికాలో అబ్బాయి, అమ్మాయి కథ చూస్తున్నంతసేపు వినోదం బాగా పండింది. ఒక్కసారిగా సాఫీగా సాగుతున్న కథను తీసుకువెళ్లి వ్యవస్థ గతంగా మార్చారు. అలా చేయకపోయి ఉంటే.. ఈ సినిమా ఇప్పుడు రూ.200 కోట్లు వసూలు చేసిందనుకుంటే.. మరో రూ.100 కోట్లు ఎక్కువగా వచ్చేవి” అంటూ పరుచూరి గోపాలకృష్ణ తన శైలి రివ్యూ ఇచ్చారు. మరి ప్రస్తుతం ఆయన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ పరుచూరి కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.