సినిమా అనే రంగుల ప్రపంచంలో అవకాశాలు రావటం సాధారణ విషయం కాదు. టాలెంట్‌తో పాటు అదృష్టం ఉంటేనే అవకాశాలు వరిస్తాయి. కొన్ని సార్లు అవకాశాలు లేక రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి ఉంటుంది. పెద్ద పెద్ద సినిమాలు చేసిన చాలా మంది నటులు కూడా చివరకు అవకాశాలు లేక దారుణమైన పరిస్థితిలో చనిపోయారు. చిన్న, సన్నకారు నటుల గురించి అయితే చెప్పనవసరం లేదు. తాజాగా, ఓ తమిళ నటుడు అత్యంత దయనీయ స్థితిలో చనిపోయాడు. ఆయనే ‘‘పరియేరుమ్ పెరుమాళ్’’ సినిమా ఫేమ్ ‘ తంగరాజ్’. ఈయన ఓ వీధి నాటకాలు వేసుకునే కళాకారుడు. తంగరాజ్ ‘‘పరియేరుమ్ పెరుమాళ్’’ సినిమాతో పాటు పలు సినిమాల్లో నటించారు.
‘‘పరియేరుమ్ పెరుమాళ్’’లో ఆయన పాత్రకు మంచి రెస్పాన్స్‌తో పాటు గుర్తింపు కూడా వచ్చింది. దీంతో ఇళ్లు లేని ఆయనకు తమిళనాడు ప్రభుత్వం ఇళ్లు కట్టించి ఇచ్చింది. తంగారాజ్ ప్రస్తుతం తిరునళ్వేలి జిల్లా, పళాయన్‌గొట్టైలోని ఆ ఇంట్లోనే ఉంటున్నారు. ఆ ఇంటికి కరెంట్ సదుపాయం కూడా లేదు. సినిమా అవకాశాలు లేకపోవటంతో ఆర్థికంగా ఆయన చాలా ఇబ్బందుల్లో పడిపోయారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడ్డారు. ఆసుపత్రికి వెళ్లటానికి కూడా డబ్బులేక అల్లాడిపోయారు. ఆఖరికి మందులు కొనడానికి కూడా డబ్బులు లేకపోయాయి. చివరకు తంగరాజ్ అనారోగ్యంతో మరణించారు.
శుక్రవారం తెల్లవారుజామున తన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. తంగరాజ్ మరణంపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. దీనిపై ప్రముఖ దర్శకుడు మారి సెల్వరాజ్ స్పందిస్తూ.. ‘‘ ఆవేశంగా డ్యాన్స్ చేసింది చాలు. విశ్రాంతి తీసుకోండి. మీ అడుగు జాడలు నా చివరి సినిమా వరకు గుర్తుంటాయి’’ అని పేర్కొన్నారు. మరి, కరెంట్ లేని పూరి ఇంట్లో నటుడు.. మందులకు కూడా డబ్బులు లేక తంగరాజ్ మరణించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#RIP Nellai Thangaraj (Pariyerum Perumal) pic.twitter.com/XU7dA9zfMH
— Christopher Kanagaraj (@Chrissuccess) February 3, 2023