రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ బడ్జెట్ లవ్ స్టోరీ రాధే శ్యామ్. 1970ల కాలంలో జరిగే అందమైన ప్రేమకావ్యంగా ఇటలీ, హైదరాబాద్ లాంటి అద్భుతమైన లొకేషన్స్ లో కళ్ళు చెదిరే సెట్స్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు మేకర్స్. మార్చి 11న రిలీజ్ కాబోతున్న రాధేశ్యామ్ అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు.
సౌత్ నుండి నార్త్ వరకు దేశవ్యాప్తంగా ప్రేక్షకులలో సినిమాపై అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన రాధే శ్యామ్ పాటలు, ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా రాధేశ్యామ్ నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాకు నెరేటర్ గా మారిపోయారు దర్శకధీరుడు రాజమౌళి. తెలుగులో రాధేశ్యామ్ కి జక్కన్న వాయిస్ ఓవర్ ఇస్తున్నారు.అదేవిధంగా కన్నడలో శివరాజ్ కుమార్.. మలయాళంలో పృథ్విరాజ్ సుకుమారన్.. తమిళంలో సత్యరాజ్ రాధే శ్యామ్ సినిమా కోసం వాయిస్ ఓవర్ అందించనున్నారు. హిందీలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ సూపర్ స్టార్స్ అందరి వాయిస్.. ఆయా భాషల్లో సినిమాకు అదనపు ఆకర్షణ అవుతుందని నమ్మకంగా చెప్తున్నారు దర్శక నిర్మాతలు.
ఇండియా, ఓవర్సీస్‌లో అత్యంత ఘనంగా రాధేశ్యామ్ రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా కోసం చాలా మంది సంగీత దర్శకులు పని చేస్తున్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలో ఒకేసారి ఒక సినిమాకు రెండు భాషల్లో వేర్వేరు సంగీత దర్శకులు పని చేయడం ఇదే తొలిసారి. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ.. కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి.