టాలీవుడ్ లో హిట్స్ ప్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న హీరో గోపీచంద్. గత కొన్నేళ్లుగా వరుసగా ప్లాప్ సినిమాలు ఖాతాలో వేసుకుంటున్నాడు. చివరి సీటిమార్ తో పరవాలేదనిపించిన గోపీచంద్.. ఇటీవల ‘పక్కా కమర్షియల్’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే.. మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలైతే క్రియేట్ చేసింది. కానీ.. ఈ సినిమా కూడా ప్రేక్షకులను పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. .
ఇక ఏ సినిమా అయినా థియేట్రికల్ రిలీజ్ అయిపోయాక ఓటిటిలోకి రావాల్సిందే కదా. ఇప్పుడు పక్కా కమర్షియల్ మూవీ కూడా ఓటిటి విడుదలకు రెడీ అయిపోయింది. ప్రముఖ ఓటిటి సంస్థలు ఆహా, నెట్ ఫ్లిక్స్ పక్కా కమర్షియల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా ఆగష్టు 5 నుండి రెండు ఓటిటిలలో స్ట్రీమింగ్ కాబోతుందని సమాచారం. అయితే.. పక్కా కమర్షియల్ మూవీ థియేటర్లో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటిటిలోకి వస్తుండటం విశేషం.
రాశీఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను యూవీ క్రయేషన్స్, జీఎ2 పిక్చర్స్ బ్యానర్స్ పై బన్నివాస్, వంశీ, ప్రమోద్‌లు సంయుక్తంగా నిర్మించారు. ఇదిలా ఉండగా.. గోపించంద్ ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో మూడో సినిమా చేస్తున్నాడు. గతంలో వీరి కాంబినేషన్ లో ‘లక్ష్యం’, ‘లౌక్యం’ లాంటి సూపర్ హిట్స్ వచ్చాయి. ఇక ‘పక్కాకమర్షియల్’తో ఆకట్టుకోలేకపోయిన డైరెక్టర్ మారుతి.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కోసం హారర్ కామెడీ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడని తెలుస్తుంది. మరి పక్కా కమర్షియల్ మూవీ ఓటిటి రిలీజ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#PakkaCommercial pic.twitter.com/jBU0iGCUK9
— Aakashavaani (@TheAakashavaani) July 30, 2022