అలియా భట్ నటించిన RRR సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో ఆమెకున్న క్రేజ్ ఎంటో అందరికీ తెలుసు. ఇప్పుడు RRRతో తెలుగులోనూ ఫ్యాన్ బేస్ ను పెంచుకోబోతోంది. సీత క్యారెక్టర్ లో ట్రైలర్, టీజర్లలో ఇప్పటికే తన నటన ఏ రేంజ్లో ఉండబోతోంది చూపించేసింది. అయితే ఈ సినిమా కంటే ముందు అలియా నటించిన ‘గంగూబాయి కతియావాడీ’ సినిమా విడుదలై రికార్డుల మోత మోగించిన విషయం తెలిసిందే. ఒక వేశ్య పాత్రలో, మాఫియా క్వీన్ పాత్రలో నటించి అందరినీ మెప్పించింది.
ఇదీ చదవండి: ఆర్ఆర్ఆర్ ‘బ్రేక్ ఈవెన్’ కి ఎంత వసూల్ చేయాలంటే..?
ఇప్పుడు అలియా భట్ గంగూబాయి సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. అలియా భట్ ఆన్ లైన్ సపోర్టర్స్ అనే పేజ్ లోని ఓ పోస్టు వివరాల ప్రకారం.. పాకిస్థాన్ లో ఓ నటుడు మునీబ్ బట్ గంగూబాయి సినిమా కోసం ఏకంగా హాలు మొత్తం బుక్ చేశాడట. తాను అలియాకు పెద్ద అభిమాని అంతేకాదు.. అతని భార్య అయిమాన్ కూడా నటే. ఆమె కూడా అలియా భట్ నటకు పెద్ద అభిమాని అని చెబుతున్నాడు. ఆమెను సర్ ప్రైజ్ చేసేందుకే అలా హాలు మొత్తం బుక్ చేశానని అతను తెలిపాడు. మరి RRR సినిమా కోసం కూడా మునీబ్ బట్ థియేటర్ మొత్తం బుక్ చేస్తాడో లేదో చూడాలి మరి. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.