గత కొంతకాలంగా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులో లేక వారి కుటుంబ సభ్యులో మృతి చెందడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటూ.. అభిమానులను తీవ్ర విషాదంలో ముంచెత్తుతున్నాయి. తాజాగా టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. కిన్నెర వాయిద్యకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శినం మొగిలయ్య ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మొగిలయ్య రెండో కుమార్తె బుద్దుల రాములమ్మ (38) మృతి చెందింది. ఆ వివరాలు.. మొగిలయ్య కుటుంబం నాగర్‌కర్నూల్ జిల్లాలో నివాసముంటున్నారు. ఆయన రెండో కూతురు రాములమ్మకు 20ఏళ్ల క్రితం లింగసానిపల్లి గ్రామానికి చెందిన వెంకటస్వామితో వివాహం జరిగింది. అయితే పెళ్లయిన నాలుగేళ్లకే భర్త చనిపోవడంతో అప్పటి నుంచి ఆమె తండ్రి మొగిలయ్యతో పాటే ఉంటుంది.
ఇది కూడా చదవండి: ఎవరీ తెలంగాణ వాగ్గేయకారుడు? ఏంటి ఈ 12 మెట్ల కిన్నెర?
ఈ క్రమంలో మంగళవారం రాములమ్మ పక్క గ్రామంక్బంకో ధువు చనిపోతే ఆమె ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా రాత్రి బీటీ రోడ్డుపై జారి పడింది. తలకు తీవ్ర గాయాలవడంతో కుటుంబసభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అచ్చంపేట ఆసుపత్రికి తరలించగా అప్పటికే రాములమ్మ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. బుధవారం కుటుంబసభ్యులు ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. మొగిలయ్యకు మొత్తం తొమ్మిది మంది సంతానం కాగా వారిలో ఇప్పటికే వివిధ కారణాలతో నలుగురు చనిపోయారు. ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో భార్య మరణించింది.
ఇది కూడా చదవండి: ‘దర్శనం మొగిలయ్య’కు ఫోన్ చేసి పవన్ కల్యాణ్ ఏం చెప్పారంటే?