దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు శ్రీకృష్ణదేవరాయలు. ఈ భాషలోని మాధుర్యం, సొగసు ఆయన చేత ఈ మాటలు అనిపించాయి. ఇక నేడు అంతర్జాతీయ వేదిక మీద కూడా ఈ మాట నిజమని నిరూపితం అయ్యింది. నాటు నాటు పాట ఆస్కార్ గెలుచుకుంది. ఈ సందర్భంగా గేయ రచయిత చంద్రబోస్ తెలుగు భాష గొప్పతనం గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు..
నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ రావడంతో.. తెలుగు జాతి ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఆస్కార్ అవార్డు సాధించిన తొలి తెలుగు చిత్రంగా ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం రికార్డు సృష్టించింది. చంద్రబోస్ కలం నుంచి జాలువారిన జానపదాలు.. తెలుగు వారినే కాక విదేశీయులను సైతం ఆకట్టుకున్నాయి. అర్థం తెలియకపోయినా సరే ఆ పదాల్లోని సొగసుకు వారు ముగ్ధులయ్యారు. ఫలితం ఇండియాలోనే కాక.. అంతర్జాతీయ వేదికల మీద కూడా నాటు కొట్టుడు కొట్టింది ఈ పాట. ఆస్కార్ లాంటి అంతర్జాతీయ స్థాయి అవార్డును సొంతం చేసుకుంది. ఇక ఆస్కార్ లైవ్ పర్‌ఫామెన్స్ సందర్భంగా స్టేజీ మీద రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవలు తమ రియల్ పర్‌ఫామెన్స్‌తో దుమ్ము రేపారు. ఈ ప్రదర్శనకు ఎంత భారీ రెస్పాన్స్ వచ్చిందంటే.. పర్‌ఫామెన్స్ పూర్తయ్యేసరికి.. అక్కడున్న ప్రతి ఒక్కరు లేచి.. చప్పట్ల మోతతో తమ ప్రశంసలు తెలిపారు. అతంటి క్రేజ్ సంపాదించుకుంది ఈ పాట.
ఇక నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డు వచ్చింది. ఈ క్రమంలో నాటు నాటు గీత రచయిత చంద్రబోస్, సంగీతదర్శకుడు ఎంఎం కీరవాణి ఇద్దరు వెళ్లి అవార్డును అందుకున్నారు. ఆక్షణం వారు పొందిన సంతోషం, గర్వం ఇలాంటి అనుభూతులను వర్ణించడానికి మాటలు చాలవు. ఇక అవార్డు అందుకున్న తర్వాత అక్కడి విలేకరులు చంద్రబోస్, కీరవాణిలను ఇంటర్వ్యూ చేశారు. అవార్డు అందుకోవడం పట్ల ఎలా ఫీలవుతున్నారు అని అడిగారు. అంతేకాక.. ఈ పాట రాసే సమయంలో మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అని చంద్రబోస్‌ను ప్రశ్నించారు. అందుకు ఆయన ఇచ్చిన సమాధానం ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.
ఈ ప్రశ్నకు చంద్రబోస్ సమాధానమిస్తూ.. తెలుగు భాష గొప్పతనం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. ‘‘తెలుగు భాష ఎంతో గొప్పగా ఉంటుంది. మా భాషలో 56 అక్షరాలు ఉంటాయి. ఎన్నో పదలు, ఎన్నో భావాలు, భావనలు ఈ భాషలో ఉంటాయి. తెలుగు భాష ఎంతో గొప్పది.. ఈ భాష సంగీత ప్రధానంగా ఉంటుంది. తెలుగు భాషలో ఓ సాధారణ పదం రాసినా.. సంగీతంలానే ఉంటుంది. ఆర్‌ఆర్‌ఆర్‌లోని నాటు నాటు పాల తెలుగు వారికి నచ్చుతుంది. ఎందుకంటే ఆ పాటలోని భావం వారికి అర్థం అవుతుంది కనుక వారు ఈ పాటను ప్రేమించారు. కానీ తెలుగు గురించి ఏమాత్రం తెలియని మీరు కూడా ఈ పాటను ఇష్టపడుతున్నారు.. ఎంజాయ్ చేస్తున్నారు, ప్రేమిస్తున్నారు అంటే అందుకు కారణం.. మా భాషలో దాగి ఉన్న సంగీతమే. దాని వల్లే ఈ రోజు ఈ అవార్డు అందుకున్నాం’’ అని తెలిపారు. చంద్రబోస్ మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలుగు భాష గురించి మీరు చెప్పిన ప్రతి మాట సత్యం సార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
The difficulties of writing a song in a language with 56 letters are broken down by Chandrabose of the #RRR. @boselyricist#OscarForNaatuNaatu #RRRMovie #NaatuNaatu #SumanTV pic.twitter.com/4CkPui1etr
— SumanTV (@SumanTvOfficial) March 13, 2023