సినీ ప్రియులు ఆత్రుతగా ఎదురు చూసిన ఆస్కార్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సారి రెండు భారతీయ చిత్రాలు రెండు విభాగాల్లో ఆస్కార్ అవార్డులు గెలుచుకున్నాయి. మరి ఇంత గ్రాండ్‌గా నిర్వహించే ఆస్కార్ వేడుక ఖర్చు ఎంతో తెలిస్తే ఆశ్చర్యంతో నోరేళ్లబెడతారు. ఆ వివరాలు..
భారతీయులు మరీ ముఖ్యంగా తెలుగు వారు ఆసక్తిగా ఎదురు చూసిన ఆస్కార్.. ఇండియాకు అందులోనూ టాలీవుడ్‌కి తరలి వచ్చింది. ఆస్కార్ 2023కి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేట్ అయిన ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. ఈ అవార్డ్ అందుకున్న తొలి భారతీయ, తెలుగు పాటగా రికార్డు సృష్టించింది. గీత రచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఆస్కార్ వేదిక మీద సగర్వంగా ఈ అవార్డును అందుకున్నారు. ఈ ఏడాది భారతదేశం రెండు ఆస్కార్ ఆవార్డులు గెలుచుకుంది. బెస్ట్ ఒరిజనల్ సాంగ్ విభాగంలో నాటు నాటు, ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో ది ఎలిఫెంట్ విస్సరర్స్ చిత్రం అవార్డులు గెలుచుకున్నాయి. ఈ రెండు అవార్డుల పట్ల ప్రతి భారతీయుడు గర్వంగా ఫీలవుతున్నాడు.
ఇక భారత కాలమానం ప్రకారం మార్చి 13 ఉదయం 5.30 గంటలకు ఆస్కార్ అవార్డుల వేడుక ప్రారంభం అయ్యింది. మొత్తం 23 విభాగాల్లో విజేతలను ప్రకటించి అవార్డులను అందజేశారు. ఈ ఏడాది మన దేశం నుంచి మూడు విభాగాల్లో (బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్) నామినేషన్స్ దక్కగా.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ విభాగాల్లో అవార్డులు గెలుచుకున్నాం.
ఇదిలా ఉంటే.. ఈ సారి ఆస్కార్ వేడుకల్లో కొన్ని కీలక మార్పులు చేశారు. ఈసారి అతిథులకు రెడ్ కార్పెట్ మీద కాకుండా.. షాంపైన్ మీద ఆహ్వానం పలికారు. అనగా కార్పెట్ రంగు మార్చారు. రెడ్ బదులు ‘షాంపైన్’ కలర్‌లోకి మార్చేశారు. ఆస్కార్ చరిత్రలో తొలిసారి ఈ రెడ్ కార్పెట్ కలర్‌ను మార్చారు. 50,000 స్క్వేర్ ఫీట్ ఉండే ఈ కార్పెట్ ధర 24 వేల 700 డాలర్స్ ఉంటుంది అంట. ఇది మొత్తం ఇన్ స్టాల్ చేయడానికి 600 గంటలు సమయం పట్టింది అని తెలుస్తోంది.
అలానే ఈసారి ఆస్కార్ అవార్డుల వేడుక కోసం 56.6 మిలియన్ డాలర్లను ఖర్చు చేశారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే అక్షరాలా 463,92,47,300 రూపాయలు. ఇందులో.. కార్పెట్ వద్ద ఓ నటి వేసుకునే డ్రెస్ ఖరీదే 10 మిలియన్ డాలర్స్ ఉంటుందని సమాచారం. ఇక ఆస్కార్ ఈవెంట్‌లో ఏదైనా యాడ్ ఇవ్వాలి అనుకుంటే 30 సెకన్లకు గాను 2 మిలియన్స్ డాలర్స్ చెల్లించాల్సి ఉంటుందట. అట్టహాసంగా ప్రారంభమైన ఆస్కార్ వేడుకలు సోమవారం ఉదయం 9 గంటలకు ముగిశాయి. మరి భారత్‌కు రెండు ఆస్కార్ అవార్డులు రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.