గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కరోనా కారణంగా పలువురు సినీ తారలు చనిపోగా.. ఆనారోగ్య కారణంగా మరికొంత మంది సినీ ప్రముఖులు కన్నుమూశారు. ప్రముఖ హాలీవుడ్ నటుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత విలియమ్ హర్ట్ మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన కొడుకు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.
1950 మార్చి 20న వాషింగ్టన్ లో ఆయన జన్మించారు. కాగా, ద బిగ్ చిల్, ఏ హిస్టరీ ఆఫ్ వయలెన్స్ సినిమాలతో విలియమ్ హర్ట్ ఎంతో మందికి పరిచయస్తులు. 1980లో వచ్చిన ‘ఆల్టర్డ్ స్టేట్స్’ ఆయనకు తొలి సినిమా. అందులో సైంటిస్ట్ పాత్రలో కనిపించారు. 1985లో వచ్చిన ‘కిస్ ఆఫ్ ద స్పైడర్ వుమెన్’ సినిమాలో స్వలింగ సంపర్క ఖైదీ పాత్రకు గాను ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డును గెలుచుకున్నారు.
ఇది చదవండి: రైలు దిగుతూ పడిపోయిన వ్యక్తి.. కాపాడిన కానిస్టేబుల్
1991లో‘అంటిల్ ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్’ సినిమాలో ఆయన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు పొందారు. 2018 మే నెలలో ఆయనకు ప్రొస్టేట్ కేన్సర్ బయటపడింది. కేన్సర్ కారణంగా మరణించారా? లేక వృద్ధాప్యపు సమస్యలతో మరణించారా? అన్న విషయాన్ని కుటుంబ సభ్యులు వెల్లడించలేదు.