‘పుష్ప’ సినిమా దేశవ్యాప్తంగా సృష్టించిన సునామీ అందరికీ తెలిసిందే. క్రికెటర్లు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఇలా ఎవరి నోట విన్నా అవే పాటలు, ఎవరిని కదిలించిననా ‘తగ్గేదేలే’ డైలాగే. యూపీ ఎన్నికల్లో తమ ప్రచార గీతాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రీవల్లి సాంగ్ ట్యూన్ తోనే చేసింది. అంతటి క్రేజ్ సంపాదించుకుంది పుష్ప సినిమా. ఆ సినిమాలో ఊ అంటావా పాటకు కూడా అనూహ్య స్పందన వచ్చింది. ఇప్పుడు ఆ సాంగ్ ను బిత్తిరి సత్తి తన వర్షన్ లో పాడాడు. కామెడీ స్టార్స్ ధమాకా ఎపిసోడ్ ప్రోమోలో బిత్తిరి సత్తి ఊ అంటావా సాంగ్ ను విటేజ్ మెలొడీ స్టైల్ లో ఆలపించాడు. ఆ ప్రోమో యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతోంది. మరి ఆ క్రేజీ రీమేక్ ఎలా ఉందో మీరూ వినేయండి.