ఫిల్మ్ డెస్క్- రామ్ హీరోగా నటించిన ఇస్మార్ట్ సినిమా సక్సెస్ తో తన ఇంటిపేరునే ఇస్మార్ట్ గా చేసుకుంది నిధి అగర్వాల్. ఈ అమ్మడికి తెలుగులో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. పూరి జగన్నాద్ సినిమా ఇస్మార్ట తో వచ్చిన పాపులారిటీతో వరుస ఆఫర్లు పట్టేస్తోంది నిధి. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మళయాళంలోనూ నిధి అగర్వాల్ భారీ సినిమాలకు సైన్ చేసింది. ఇక తెలుగులో నిధి అగర్వాల్ భారీ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్‌లో వస్తోన్న హరి హర వీర మల్లు మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు గల్లా అశోక్ హీరోగా నటిస్తున్న సినిమాలోను నిధి అగర్వాల్ హీరోయిన్‌గా చేస్తోంది.
ఇక సినిమాలతో బిజీగా ఉంటూనే.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటోంది ఈ ఇస్మార్ట్ బ్యూటీ. ఈ క్రమంలోనే నిధి అగర్వాల్ తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. అందులో ఓ కుక్క తప్పిపోయినట్టు చెప్పిన నిధి.. దాన్ని పట్టించి ఇచ్చిన వారికి లక్ష రూపాయల రివార్డ్ కూడా లభిస్తుందని పేర్కొంది. పోస్టర్ లో పెట్ తాలుకు వారి కాంటాక్ట్ నెంబర్, పెట్ పేరు, మిగతా వివరాలన్నీ కూడా ఇచ్చింది. ఇలా కుక్క తప్పిపోయిందంటూ నిధి అగర్వాల్ కు సంబందించిన పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐతే ఈ కుక్క తనదా లేక మరెవరిదైనదా అన్నది మాత్రం ఈ ఇస్మార్ట్ బ్యూటి చెప్పలేదు.