నరేష్- పవిత్ర లోకేశ్ బంధం గురుంచి సోషల్ మీడియాలో/ యూట్యూబ్ ఛానళ్లలో అసభ్యకరంగా పోస్టులు. పర్సనల్ ఫోటోలు మార్పింగ్ చేసి అసభ్యకరంగా సృష్టిస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ. ఈ పోస్టులపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను ఆశ్రయించిన నరేష్.
సినీ నటీనటులు నరేష్- పవిత్ర లోకేశ్ బంధం గురుంచి తెలుగు ప్రేక్షకులకు సుపరిచతమే. వీరి రిలేషన్ షిప్ గురుంచి ఇటీవలే సమాజానికి తెలియజేసిన ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబుతున్నట్లు గాఢమైన ముద్దు బంధంతో తెలియజెప్పారు. వాస్తవంగా చెప్పాలంటే ఇదొక ముగిసిన అధ్యాయం. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారికుంటాయి.. వారిని గౌరవించాలి. కానీ, ట్రోలర్స్/యూట్యూబ్ నిర్వాహకులు మాత్రం ఇప్పట్లో వీరిద్దరిని వదలిపెట్టేలా కనిపించడం లేదు. ఉదయాన్నే లేచింది మొదలు వీరిద్దరి బంధంపై అసభ్యకరంగా పెద్ద పెద్ద హెడ్డింగ్ లు పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కాసులు వెనకేసుకుంటున్నారు.
ఇప్పటికే ఈ విషయంపై నరేష్- పవిత్ర లోకేశ్ జంట సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తమ ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో/ యూట్యూబ్ ఛానెళ్లలో వైరల్ చేస్తున్నారని కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, వెబ్ సైట్స్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ, వీరిద్దరి బంధంపై గాసిప్స్ ఆగడం లేదు. ఈ క్రమంలో నటుడు నరేష్ మరోసారి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు విచ్చేసారు. తనపై, పవిత్రపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన యూట్యూబ్ ఛానల్స్ మీద ఫిర్యాదు చేశారు. అలాగే, గతంలో ఇచ్చిన ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో.. వివరాలు అడిగి తెలుసుకున్నారు.