పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం ఉన్న సినిమాలు అన్ని భారీ బడ్జెట్‌వే. సలార్, ప్రాజెక్ట్ కె, ఆదిపురుష్ ఇలా వరుస భారీ బడ్జెట్, పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నాడు ప్రభాస్. వీటిల్లో సలార్‌పై ఓ రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి. కారణం కేజీఎఫ్ దర్శకు ప్రశాంత్ నీల్ సలార్ సినిమాకు డైరెక్టర్ కావడంతో.. ఈ సినిమాపై పాన్ ఇండియా రేంజ్‌లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 50 శాతం పూర్తయ్యింది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న ఈ సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ సినిమాకు సంభంధించి మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. సినిమాలో ప్రభాస్‌కు విలన్‌గా నటిస్తోన్న మలయాళ స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రకు సంబంధించిన లుక్‌ని ఆదివారం విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరలవుతోంది.
సలార్ చిత్రంలో పృథ్వీరాజ్ విలన్ పాత్రలో నటించనున్నాడు. సినిమాలో ఆయన పాత్ర పేరు వరదరాజ మన్నార్. పృథ్వీరాజ్ లుక్ చూస్తుంటే.. సినిమాలో ఆయన పండించే విలనీజం పీక్స్‌లో ఉండనున్నట్లు అర్థం అవుతోంది. ఈ సినిమాలో పృథ్వీరాజ.. జగపతిబాబు కొడుకు పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. గతంలో విడుదల చేసిన జగపతిబాబు పోస్టర్‌లో ఆయన పాత్ర పేరు రాజమన్నార్‌గా రివీల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రివీల్ చేసిన పృథ్వీరాజ్ లుక్ పోస్టర్‌లో ఆయన పేరు వరదరాజ మన్నార్‌గా రివీల్ చేయబోతుండటంతో.. ఆయన జగపతి బాబు కొడుకు పాత్రలో కనిపించబోతున్నట్లు అర్థం అవుతోంది.
ఇక ప్రశాంత్ నీల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రుతీ హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ ఫుల్ మాస్ హీరోగా కనిపించబోతున్నడాఉ. కె.జి.యఫ్ సిరీస్, కాంతార వంటి చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ క్రమంలో ప్రభాస్ ఫ్యాన్స్ సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
Thank you #HombaleFilms #PrashanthNeel #Prabhas and the entire team of #Salaar! 😊 #VardharajaMannaar will see you in theatres on the 28th of September 2023!#Salaar #TheEraOfSalaarBegins#Prabhas @prashanth_neel @VKiragandur @hombalefilms pic.twitter.com/fZ8V3BAjfl
— Prithviraj Sukumaran (@PrithviOfficial) October 16, 2022