ప్రతి మహిళ మాతృత్వాన్ని గొప్ప వరంగా భావిస్తుంది. పెళ్లి చేసుకుని.. బిడ్డకు జన్మనివ్వాలని కోరుకుంటుంది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత స్త్రీ జీవితం పూర్తిగా మారిపోతుంది. తనకంటూ ఓ జీవితం ఉందనే విషయాన్ని మర్చిపోయి.. బిడ్డలే లోకంగా బతుకుతుంది. వారు సంతోషిస్తే తాను సంబరపడుతుంది.. వారు బాధపడితే.. తాను ఏడుస్తుంది. ఇక బిడ్డలకు చిన్న అనారోగ్యం వచ్చినా.. తల్లి మనసు కుదురుగా ఉండదు. వారు కోలుకునేవరకు.. తల్లికి కంటి మీద కునుకు ఉండదు. బిడ్డ కోలుకున్న తర్వాతే ఆ తల్లికి ప్రశాంతత, మనశ్శాంతి లభిస్తాయి. అచ్చంగా తాను కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాను అంటుంది గ్లోబల్ స్టార్ ప్రియాకం చోప్రా. తన బిడ్డ అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకుని ఇంటికి చేరుకునే వరకు తన మనసు మనసులో లేదని తెలిపింది. తొలిసారి మదర్స్ డే సందర్భంగా బిడ్డతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేసి… కుమార్తె అనారోగ్యం పరిస్థితి గురించి వివరించింది ప్రియాంక చోప్రా. ప్రస్తుతం పోస్ట్ తెగ వైరలవుతోంది. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: చిన్నారి రాకతో మా జీవితాల్లోకి సంతోషం వచ్చింది
సరోగసి ద్వారా ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్ దంపతులు తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో వారికి కుమార్తె జన్మించింది. తమ గారాల పట్టి పేరు ‘మాల్టీ మేరీ చోప్రా జోనస్’ ప్రకటించిన ప్రియాంక తాజాగా కూతురి గురించి ఓ షాకింగ్ న్యూస్ పంచుకుంది. ఆదివారం మదర్స్ డే సందర్భంగా తొలిసారి తన కూతురు ఫొటోను షేర్ చేస్తూ భావోద్వేగానికి గురయ్యింది ప్రియాంక. దాదాపు 100 రోజుల తర్వాత తన కూతురు ఇంటికి వచ్చిందని, మదర్స్ డే సందర్భంగా తమ ఇంట్లోకి నవ్వులు తిరిగొచ్చాయని ఆమె పేర్కొంది. వారి కూతురు మాల్టీ 100 రోజులకు పైగా హాస్పిటల్‌లో చికిత్స పొందినట్లు ప్రియాంక తెలిపింది.
ఇది కూడా చదవండి: ఇంత పెద్ద ఇష్యూ అవుతుంది అనుకోలేదు..తన కుమార్తె మాల్టీ లాస్ ఎంజల్స్‌లోని పిల్లల హాస్పిటల్‌లో నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందినట్లు ప్రియాంక తెలిపింది. దాదాపు 100 రోజుల తర్వాత తన కుమార్తె పూర్తి ఆరోగ్యంతో ఇంటికి తిరిగి రావడంలో డాక్టర్లు, నర్సులు ముఖ్య పాత్ర పోషించారని, ఈ సందర్భంగా వారందరికి ప్రియాంక కృతజ్ఞతలు తెలిపింది. అనంతరం తమ జీవితాల్లో మరో అధ్యాయం మొదలైందని, మమ్మీ-డాడీ లవ్స్ యూ.. అంటూ ప్రియాంక తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఇక ఆమె పొస్ట్‌పై పలువురు బాలీవుడ్ స్టార్స్ స్పందిస్తూ సైతం ఎమోషనల్ అయ్యారు. ప్రీతి జింటా, పరిణితి చోప్రా, దియా మిర్జా, మలైక అరోరాలు కామెంట్స్ చేస్తూ లవ్ ఎమోజీతో ప్రియాంక, నిక్ దంపతుల కూతురు మాల్టీకి స్వాగతం పలికారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: నవమాసాలు మోయకుండానే ‘అమ్మ’ అయ్యారు