మాతృత్వం అనేది ప్రతి స్త్రీ జీవితంలో మరపురాని మధురానుభూతి. 9 నెలల తన కడుపులో బిడ్డను మోసి.. జన్మనిచ్చే అపురూప క్షణాల కోసం ప్రతి వివాహిత తపించిపోతుంది. ఆ కోరిక నిజమైన రోజున ఆ స్త్రీ అనుభవించే సంతోషాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. ప్రస్తుతం తాను ఇదే అనుభూతిని పొందుతున్నట్లు వెల్లడించింది హీరోయిన్ నమిత. సొంతం సినిమాతో కెరీర్‌ను మొదలు పెట్టిన నమిత.. ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేసింది. కొన్ని రోజులు తెలుగు సినిమాలకు గ్యాప్ ఇచ్చినప్పటకి.. ఆ తర్వాత ప్రభాస్ బిల్లా, బాలకృష్ణ సింహ చిత్రంలో నటించింది నమిత. మే 10న నమిత పుట్టిన రోజు. ఈ సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పింది నమిత. తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించడమేకాక.. బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను షేర్ చేసింది.
ఇది కూడా చదవండి: కడుపుబ్బరం అనుకుని బాత్‌రూమ్‌కు వెళ్లింది.. భర్త షాక్!
”మాతృత్వం… నా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. నేనూ మారాను, నాలోనూ మార్పు మొదలైంది. నా ముఖంలో సరికొత్త చిరునవ్వు వచ్చింది. కొత్త జీవితం, కొత్త పిలుపులు… మాతృత్వపు అనుభూతి కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూశా.. ఎన్నో ప్రార్థనలు చేశా.. చివరకు నా కోరిక ఫలించింది. చిన్నారి కిక్స్ కొత్త అనుభూతిని ఇస్తున్నాయి. ఇంతకు ముందు ఎప్పుడూ లేని సరికొత్త భావనను అనుభవిస్తున్నాను” అంటూ బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను షేర్ చేసింది నమిత. ప్రస్తుతం ఇవి తెగ వైరలవుతున్నాయి. అభిమానులు ఆమెకు పుట్టినరోజు శుభాకాక్షలతో పాటు అభినందనలు తెలుపుతున్నారు. వీరేంద్ర చౌదరితో 2017లో నమిత వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కూడా ఆమె సినిమాలు చేశారు, చేస్తున్నారు. గర్భవతి కావడంతో కొన్ని రోజులు సినిమాలకు తాత్కాలిక విరామం ఇవ్వనున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ఆమె పెళ్లైన 10 రోజులకే 8నెలల గర్భవతి అయ్యింది, కారణం ఏంటంటే..