భారీ బడ్జెట్‌తో.. టాలీవుడ్, బాలీవుడ్, ఇంగ్లీష్ ఇలా వేర్వేరు ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖ తారాగణంతో తెరకెక్కిన చిత్రం త్రిబుల్ ఆర్. భారీ అంచనాల మధ్య మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యింది RRR చిత్రం. పాన్ ఇండియా సినిమాగా వచ్చిన ఈ చిత్రం.. కలెక్షన్ల వసూళ్లలో రికార్డులు క్రియేట్ చేస్తుంది. బాక్సాఫీస్ దగ్గర ఏడు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుని మొదటి వారం అత్యధిక వసూళ్లను సాధించిన పాన్ ఇండియా సినిమాగా రికార్డుకెక్కింది. రోజు రోజుకు కలెక్షన్ల వసూళ్లలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ.. అన్ని ఇండస్ట్రీలకు షాక్ ఇస్తూ వస్తోంది. అయితే మొదటి ఆరు రోజుల వరకు కూడా సినిమా తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన RRR.. ఏడవ రోజు మాత్రం అల్లు అర్జున్, మహేష్ బాబుల సినిమాల కంటే తక్కువ స్థాయిలో షేర్ అందుకోవడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇది కూడా చదవండి: పవన్ కల్యాణ్ రేంజ్ స్టార్ ఎవరూ లేరు.. విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్ వైరల్!
త్రిబుల్ ఆర్ సినిమా ఏడవ రోజు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ లో టోటల్ గా 187కోట్ల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 392.45కోట్ల షేర్ సాధించింది. ఇక గ్రాస్ లో అయితే వరల్డ్ వైడ్ గా ‘ఆర్.ఆర్.ఆర్’ 700కోట్లను సాధించినట్లు సమాచారం. ఇక చాలా ఏరియాల్లో సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను ఫినిష్ చేయాల్సి ఉంది. ఇక ఈ సినిమా 7వ రోజు అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాల్లో 5వ స్థానంలో నిలవడం విశేషం.
ఇది కూడా చదవండి: ఆర్‌ఆర్‌ఆర్‌లో ‘కొమ్మా ఉయ్యాల’ పాట పాడింది ఈ పాపే..7వ రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలో మొదటి స్థానంలో అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమా ఉంది. ఇది రూ.8.43కోట్ల షేర్ ను అందుకుంది. అనంతరం బాహుబలి 2 రూ.8.30 కోట్లు రాబట్టగా.. మెగాస్టార్ చిరంజీవి.. సై రా రూ.7.90కోట్లు, మహేష్ బాబు.. సరిలేరు నీకెవ్వరు రూ.7.64కోట్ల షేర్ తో 7వ రోజు అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాలుగా నిలిచాయి. ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 7వ రోజు ఆ సినిమాల కంటే తక్కువగా రూ.7.48కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి 5వ స్థానంలో నిలిచింది.
ఇది కూడా చదవండి: పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన Jr NTR.. ఏమన్నారంటే!
అయితే 7 రోజుల్లో టోటల్ కలెక్షన్ల విషయంలో మాత్రం ‘ఆర్.ఆర్.ఆర్’ రూ.187 కోట్లతో టాప్ లో ఉంది. ఇక హిందీలో కూడా కలెక్షన్స్ భారీగానే ఉన్నాయి. ఏడో రోజు తగ్గినప్పటికి తర్వాత ఉగాది, ఆదివారం కలిసి రావడంతో.. RRR కలెక్షన్లు అనూహ్యంగా పుంజుకున్నాయి. ఇక అన్ని ఇండస్ట్రీల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా RRR ఇప్పటికే రికార్డులు క్రియేట్ చేస్తోంది.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.