తిరుమల శ్రీవారిని దర్శించుకుని కృతి సనన్ బయటకు వచ్చారు. ఆమె తన కారు దగ్గర ఉన్న సమయంలో దర్శకుడు ఓం రౌవత్ అక్కడికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే కృతిని హత్తుకుని..
నిన్న తిరుపతిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ నెల 16న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రముఖ పుణ్య క్షేత్రం తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్‌లో లక్షల మంది ప్రభాస్ ఫ్యాన్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హీరో ప్రభాస్, హీరోయిన్ కృతి సనన్, దర్శకుడు ఓం రౌవత్‌తో పాటు ఇతర చిత్ర బృందం పాల్గొంది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కొన్ని గంటల ముందు ప్రభాస్, కృతి సనన్, ఓం రౌవత్‌లు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నారు. ముగ్గురూ వేరు వేరు సమయాల్లో దర్శనానికి వెళ్లారు.
కృతి దేవుడి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఓం రౌవత్ ఆమెను కలుసుకున్నారు. ఈ సందర్భంగా కృతిని హత్తుకుని, బుగ్గపై ముద్దు పెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై వెంకటేశ్వరస్వామి వారి భక్తులు సీరియస్ అవుతున్నారు. పవిత్ర పుణ్య క్షేత్రంలో ముద్దులు పెట్టుకోవటం ఏంటని సీరియస్ అవుతున్నారు. దైవ దర్శనానికి వచ్చినపుడు పద్దతులు మార్చుకోవాలని, భక్తి భావంతో ఉండాలని హితవు పలుకుతున్నారు.
కాగా, ఆదిపురుష్ విడుదలకు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా థియట్రికల్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి. ఏపీ, తెలంగాణకు సంబంధించి 170 కోట్ల రూపాయలకు పైనే రైట్స్ అమ్ముడయ్యాయంట. ఇక, ఓటీటీ రైట్స్ విషయంలోనూ ఆదిపురుష్ రికార్డు సృష్టించింది. చిత్ర బృందం సినిమా ఓటీటీ హక్కులను ఏకంగా 250 కోట్ల రూపాయలకు అమ్మినట్లు తెలుస్తోంది. మరి, పవిత్ర పుణ్య క్షేత్రంలో ఓం రౌవత్, కృతిని అలా ముద్దు పెట్టుకోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.