సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఉంటే ఈజీగా స్టార్ అవ్వచ్చు అనుకుంటారు. కానీ అది కేవలం ఎంట్రీ వరకు మాత్రమే పనికివస్తుందని చాలామందికి తెలియదు. అలా స్టార్ హీరో కూతురిగా స్ట్రాంగ్ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది శృతి హాసన్. తండ్రి కమల్ హసన్, తల్లి సారికా ఠాకూర్..స్వతహాగా సింగర్ కూడా ఐనా శృతి తండ్రి నటించిన ‘హే రామ్’ సినిమాలో ఓ పాట పాడి,. బాలనటిగా చిన్న పాత్రలో తళుక్కున మెరిసింది. ఆ తర్వాత లక్ మూవీతో బాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ చేసిన సినిమాలన్నీ వరుసగా ప్లాపులు అవ్వడంతో ఐరన్ లెగ్ గా విమర్శలు ఎదురుకుంది. అయినా వెనుతిరగలేదు. టాలెంట్ ను, నటనను నమ్ముకుని సక్సెస్ కోసం ఓపిగ్గా ఎదురుచూసింది. ఇప్పుడు సక్సెస్ ఫుల్ స్టార్ హీరోయిన్. టాలెంటెడ్ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకుల మన్ననలు పొందుతూ స్టార్ హీరోలతో ఆడిపాడింది. అయితే ఆ మధ్యకాలంలో ప్రేమలో పడిన ఈ బ్యూటీ కొంతకాలం పాటు సినిమాలు పక్కన పెట్టేసి తన మాజీ ప్రియుడు, ఇంగ్లండ్ సింగర్ మైకేల్ కోర్సలేతో రొమాంటిక్ టూర్స్ వేసింది. ఈ ఇద్దరి పెళ్లి కన్ఫర్మ్ అని అంతా ఫిక్సయ్యాక మెల్లగా అతనితో కట్ చేసుకున్న శృతి తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేసింది.
ఇదిలాఉంటే అందరిలాగే తనకు కూడా ఆర్ధిక ఇబ్బందుకున్నాయంటూ శృతి ఓపెన్ కావడం హాట్ టాపిక్ అయింది.
హీరోయిన్ కావడంతో వీళ్లకేం ఉంటాయిలే బాధలు అనుకుంటున్నారని.. అయితే అలాంటిదేం లేదని, తనకు కూడా చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటూ తెలిపింది ఈ ముద్దుగుమ్మ. ఈ కరోనా సమయంలో చేతిలో డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నాని చెప్పింది శృతి హాసన్. నాకు సహాయం చేయడానికి ఎవ్వరూ లేరు. నా ఖర్చులు నేనే సంపాదించుకుంటా. అందుకే పనిచేసి తీరాలి. నా పర్సనల్ లైఫ్, కెరీర్‌కు సంబంధించిన నిర్ణయాలు నేనే స్వయంగా తీసుకుంటా. ఈ కరోనా కారణంగా నష్టాల్లో ఖరీదైన కార్లు, ఇళ్లు కొనే ప్రయత్నం చేయలేదని చాలామంది స్మార్ట్ పీపుల్ చెబుతుంటారు. కానీ నేను మాత్రం ఓ ఇల్లు కొనుకున్నా. ఇండిపెండెంట్‌గా ఎదగడం నాకెంతో గర్వంగా అనిపిస్తోంది. నా వెనుక దేవుడు ఉన్నాడని బలంగా నమ్ముతాను. తన దగ్గర డబ్బులు లేకపోయినా కూడా సాయం కోసం అమ్మా, నాన్నల దగ్గరికి మాత్రం వెళ్లనని చెప్పింది ఈమె. చాలా మంది ఈ కరోనా సమయంలో.. లాక్‌డౌన్ వేళలో తెలివిగా ఉన్నారని.. కానీ తాను అలా చేయలేకపోయానని చెప్పింది. ఒక్కో సినిమాకు కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకునే ఈమెకు కూడా ఆర్థిక ఇబ్బందులున్నాయా? వినడానికి కూడా చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదా? కానీ ఇదే నిజం అంటుంది ఈ ముద్దుగుమ్మ.