సినీ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టులుగా కెరీర్ ప్రారంభించిన వారు పెద్దయ్యాక హీరోలు, హీరోయిన్లుగా సినిమాలు చేయడం చూశాం. కొందరు సినీరంగంలోనే కంటిన్యూ అవుతుంటారు. మరికొందరు చైల్డ్ ఆర్టిస్టులుగా సినిమాలు చేసినప్పటికీ, స్టడీస్ మీద ఫోకస్ పెట్టేందుకు ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోతుంటారు. ఆ విధంగా చైల్డ్ ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చి హీరోలు/హీరోయిన్స్ అయినవాళ్లను తెలుగులో చాలామందిని చూశాం. అలాగే సినీ రంగానికి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళను కూడా చూశాం. అలాంటివారిలో ఒకరు నిహారిక.
ఇండస్ట్రీలో ఇదివరకు స్టార్ హీరోయిన్స్ గా వెలిగిన వారంతా చిన్నతనంలో చైల్డ్ ఆర్టిస్టులుగా సినిమాలు చేసినవారే. అయితే.. పెద్దయ్యాక సినిమాలు చేసేవారు కొంతమంది.. పర్సనల్ లైఫ్, స్టడీస్ పై ఫోకస్ పెట్టేవారు ఇంకొంతమంది. ఆ రెండో కోవకే చెందుతుంది నిహారిక. మామూలుగా చైల్డ్ ఆర్టిస్ట్ నిహారిక అంటే.. ఎవరూ గుర్తుపట్టరు. కానీ ఒక్కడు సినిమాలో మహేష్ బాబుకు చెల్లిగా నటించిన అమ్మాయి అంటే ఈజీగా గుర్తుపడతారు.‘ఒక్కడు’ సినిమాలో మహేష్ ని ‘ఒరేయ్ అన్నయ్యా..’ అంటూ ఆటపట్టించిన అల్లరి చెల్లిగా నిహారిక నటించింది. అంతకుముందే ప్రేమించుకుందాం రా, యమజాతకుడు లాంటి పలు సినిమాలలో నటించినప్పటికీ, ఒక్కడుతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అప్పుడంటే బేబీ నిహారిక.. కానీ ఇప్పుడు మాత్రం ఇద్దరు పిల్లలకు తల్లి నిహారిక. ఒక్కడు సినిమానే నిహారిక చేసిన చివరి సినిమా. ఆ తర్వాత పూర్తిగా చదువుపై దృష్టి పెట్టిన నిహారిక.. పదేళ్ల కిందట పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తిని పెళ్లాడింది. మరి నిహారిక.. చదువయ్యాక సినిమాల్లోకి ఎందుకు రాలేదు? ఒక్కడు ఆఫర్ ఎలా వచ్చింది? ఇంతకీ ఆమెది ప్రేమ పెళ్లా లేక పెద్దలు కుదిర్చిందా? మరి మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుందా లేదా అనేది వీడియోలో చూడండి. మరి నిహారిక గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.