ఒక సినిమా హిట్టో ఫట్టో అనేది హౌస్ ఫుల్ బోర్డు తేల్చేస్తుంది. ఒక సినిమా రిలీజైన రెండు, మూడు రోజుల తర్వాత కూడా హౌస్ ఫుల్ బోర్డు కనబడుతుందంటే ఆ సినిమా హిట్ అన్నట్టు. హౌస్ ఫుల్ అన్న మాట వినబడుతుందంటే అది కంటెంట్ ఉన్న సినిమా అన్నట్టు. ప్రస్తుతం ఒకే ఒక జీవితం సినిమా పరిస్థితి కూడా ఇదే. భారీ అంచనాలు, భారీ ప్రమోషన్ లు లేకుండా సింపుల్ గా రిలీజ్ అయిన ఈ సినిమా కేవలం నోటి మాట ద్వారా జనాన్ని చేరుకుంటుంది. తల్లి సెంటిమెంట్ తో కూడిన బరువైన సన్నివేశాలు ఉండడం, టైట్ స్క్రీన్ ప్లే, కథ అద్భుతంగా ఉండడం లాంటి కారణాల వల్ల ఈ సినిమాకి ప్రస్తుతం హౌస్ ఫుల్ బోర్డ్స్ పడుతున్నాయి. అప్పటికప్పుడు థియేటర్స్ కి వెళ్లి టికెట్స్ తీసుకుందామనుకుంటే దొరకడం లేదు. పైగా మాస్ థియేటర్స్ లో అయితే అడ్వాన్స్ గా టికెట్లు ఇవ్వమని అనేస్తున్నారు. అంతలా ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.
కంటెంట్ ఉన్న ఏ సినిమా అయినా ఇలానే దూసుకుపోతుంది. ఇందులో ప్రత్యేకత ఏముంది? అని అనుకోకండి. అసలు మేటర్ ఇక్కడే ఉంది. శర్వానంద్ హీరోగా, రీతూ వర్మ హీరోయిన్ గా.. అక్కినేని అమల, వెన్నెల కిషోర్, ప్రియదర్శి కీలక పాత్రల్లో వచ్చిన ఈ సినిమాకి శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో సైన్స్ ఫిక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 9న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. అయితే నిన్న (సెప్టెంబర్ 11న) డైరెక్టర్ శ్రీ కార్తీక్.. హైదరాబాద్ లోని మూసాపేట్ లో ఉన్న చంద్రకళ థియేటర్ కి వెళ్లారు. ఉదయం ఆటకి ‘ఒకే ఒక జీవితం’ సినిమా టికెట్ ఒకటి కావాలని అడిగారు.
దానికి టికెట్ ఇచ్చే వ్యక్తి.. ఒక్క టికెట్ కూడా లేదని, అన్నీ బుక్ అయిపోయాయని, హౌస్ ఫుల్ అని చెప్పాడు. పోనీ సాయంత్రం షోకి ఉన్నాయా అని అడుగగా.. ఉన్నాయి కానీ అడ్వాన్స్ బుకింగ్ లేదని చెప్పాడు. దీంతో డైరెక్టర్ శ్రీ కార్తీక్.. తాను ఈ సినిమా డైరెక్టర్ నని ఆ టికెట్ ఇచ్చే వ్యక్తికీ చెప్పారు. ఆ తర్వాత “చూశారా, నా సినిమాకి డైరెక్టర్ ని అయిన నాకే టికెట్ దొరకలేదు. ఇదే విజయం అంటే” అంటూ ఒక వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకే ఒక జీవితంకి ఒకే ఒక టికెట్ అడిగినా డైరెక్టర్ శ్రీ కార్తీక్ కి టికెట్ దొరకలేదంటే సినిమా ఎంత పెద్ద హిట్టో అర్ధం చేసుకోవచ్చు. మరి డైరెక్టర్ కి టికెట్ దొరకనంతగా ఈ సినిమా విజయం సాధించడంపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.
Ledhu bhaiya !! House full 🤣🤣🤣🤣 #okeokajeevitam #kanam Officially Running successfully @ImSharwanand @riturv @prabhu_sr @priyadarshi_i @vennelakishore pic.twitter.com/X7JnHMGNSu
— Shree karthick (@twittshrees) September 11, 2022