అనిఖా సురేంద్రన్.. చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ మెుదలు పెట్టి హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా బుట్టబోమ్మ అనే సినిమా ద్వారా తెలుగు తెరపైకి డెబ్యూ చేసింది. తొలి సినిమాతోనే తన అందచందాలతో కుర్రాళ్ల గుండెలను కొల్లగొట్టింది ఈ బ్యూటీ. ఇక కేవలం టాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ అమ్మడు సినిమాలు చేస్తుంది. తాజాగా మలయాళంలో ‘ఓ మై డార్లింగ్’ అనే మూవీ చేసింది. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో లిప్ లాక్ లతో రెచ్చిపోయింది అనిఖా సురేంద్రన్.
‘ఓ మై డార్లింగ్’.. అనిఖా సురేంద్రన్, మెల్విన్ జి బాబు జంటగా నటించిన చిత్రం. ఈ సినిమా ద్వారా మలయాళంలోకి ఎంట్రీ ఇస్తుంది అనిఖా. తెలుగులో ఇప్పటికే బుట్టబోమ్మ సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ సొగసరి. ఇక ఓ మై డార్లింగ్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. ఇక తన రెండో సినిమాలోనే తన విశ్వరూపం చూపించింది అనిఖా సురేంద్రన్. లిప్ లాక్ లతో రెచ్చిపోయి అందరికి షాక్ ఇచ్చింది. రెండో సినిమాతోనే ఈ రేంజ్ లో బోల్డ్ నెస్ ప్రదర్శించడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు.
ఇక ఈ ట్రైలర్ లో లిప్ లాక్ లు చూసిన నెటిజన్లు.. అమ్మడుకు ఇండస్ట్రీ నీళ్లు తొందరగానే వంటబట్టాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఎప్పటిలాగే తన అల్లరి నటనతో ట్రైలర్ లో ఆకట్టుకుంది అనిఖా. ఇక చైల్డ్ ఆర్టిస్టుగా అనిఖా చాలా సినిమాల్లోనే మెరిసింది. విశ్వాసం మూవీలో అజిత్ కూతురిగా, ఘోస్ట్ సినిమాలో నాగర్జున మేనకోడలిగా నటింటి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తాజాగా నటిస్తున్న ఓ మై డార్లింగ్ చిత్రానికి ఆల్ప్రెడ్ శామ్యూల్ దర్శకత్వం వహిస్తుండగా.. కథను జినేష్ కే జోయ్ అందించాడు. మరి రెండో సినిమాతోనే రెచ్చిపోయి లిప్ లాక్ లు ఇచ్చిన అనిఖా సురేంద్రన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.