పవన్-సుజీత్ 'OG'మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. నిర్మాత దానయ్య.. తన గత చిత్రం 'ఆర్ఆర్ఆర్' స్టైల్ నే దీనికి కూడా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయమే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫుల్ స్పీడు మీదున్నారు. ఓవైపు రాజకీయాల్లో జోష్ మెంటైన్ చేస్తూనే.. మరోవైపు ‘వినోదయ సీతం’ రీమేక్ షూటింగ్ లోనూ పాల్గొన్నారు. రీసెంట్ గా పవన్ కు సంబంధించిన టాకీ పార్ట్ మొత్తం పూర్తయిపోయింది. ఇది తెలిసి పవర్ స్టార్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రమంలోనే పవన్ తర్వాతి సినిమాల గురించి డిస్కషన్ కూడా స్టార్ట్ చేసేశారు. వీటిలో ఫ్యాన్స్.. సుజీత్ డైరెక్ట్ చేస్తున్న ‘OG’ గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. పవర్ కల్యాణ్ రెగ్యులర్ రొటీన్ కమర్షియల్ సినిమాలతో పాటు గ్యాంగస్టర్ టైప్ ఆఫ్ మూవీస్ చేయాలని ఫ్యాన్స్ కోరిక. అప్పట్లో ‘పంజా’ అనే గ్యాంగస్టర్ డ్రామాలో నటించినప్పటికీ, బాక్సాఫీస్ దగ్గర అది సరిగా వర్కౌట్ కాలేదు. మళ్లీ ఇన్నాళ్లకు పవన్ పూర్తిస్థాయి ‘గ్యాంగ్ స్టర్’గా సుజీత్ సినిమాలోనే చేస్తున్నాడు. ఇక ఈ ప్రాజెక్టుకు వర్కింగ్ టైటిల్ గా ‘OG’ అనుకున్నారు. ఇప్పుడు దాన్ని టైటిల్ గానూ రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. నిర్మాత డీవీవీ దానయ్య ఈ టైటిల్ పైనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట.
దానయ్య గత సినిమా ‘RRR’ నే తీసుకుంటే.. రాజమౌళి డైరెక్టర్, రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలు అయ్యేసరికి అందరి పేర్లు కలిసి వచ్చేలా #RRR అని వర్కింగ్ టైటిల్ పెట్టుకున్నారు. దాన్నే ఆ తర్వాత టైటిల్ గా ఫిక్స్ చేశారు. ఇప్పుడు సేమ్ ఇదే రూట్ ని ఫాలో అయిపోయిన నిర్మాత దానయ్య.. పవన్-సుజీత్ మూవీకి ‘OG’ టైటిల్ ఫిక్స్ చేశారని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం పాన్ ఇండియా వైడ్ రీచ్ ఎక్కువగా ఉంటుందనిపిస్తోంది. ప్రస్తుతం లోకేషన్స్ వేటలో మూవీ టీమ్ ఉంది. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో లేదంటే వచ్చే వేసవికి ఈ మూవీ థియేటర్లలోకి వచ్చే ఛాన్సులు గట్టిగా కనిపిస్తున్నాయి. సరే ఇదంతా పక్కనబెడితే పవన్ సినిమా టైటిల్ విషయంలో ‘ఆర్ఆర్ఆర్’ స్టైల్ ఫాలో కావడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
Pan Indian Release 🔥 #Pawankalyan #Og #OriginalGangster
Follow us 👉 @tollymasti pic.twitter.com/AWAQbwymyS— Tollymasti (@tollymasti) March 29, 2023