గత కొద్దిరోజులుగా కాలేయ సంబంధిత అనారోగ్యంతో ఆయన బాధపడున్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆరోగ్యం క్షీణించింది. బుధవారం రాత్రి ఆయన..
2023 సంవత్సరంలో సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. కే.విశ్వనాథ్, నందమూరి తారకరత్నతో పాటు వివిధ భాషలకు చెందిన చాలా మంది నటీ,నటులు మరణించారు. బుధవారం రాత్రి కూడా ఓ విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ ఒరియా నటుడు పింటు నంద కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో కన్నుమూశారు. 45 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. ఆయన గత కొన్ని నెలలుగా కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. మొదట్లో భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు.
ఆరోగ్యంలో ఎలాంటి మార్పు లేకపోవటంతో ఢిల్లీలోని లివర్ అండ్ బిలియరీ సైన్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ లివర్ ప్లాంటేషన్ చేయిద్దామని భావించారు. అయితే, అక్కడ ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించటం మొదలైంది. కాలేయం ఇవ్వడానికి దాతలు దొరక్కపోవటంతో హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తూ వస్తున్నారు. బుధవారం రాత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. చికిత్స పొందుతూనే చనిపోయారు. నంద మృతితో ఒరియా సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నంద మృతిపై సంతాపం తెలియజేస్తున్నారు. ఒరియా ఫిల్మ్ ఫ్రాటెర్రిటీ కూడా దీనిపై స్పందించింది.
నంద మరణం బాధకరమని, ఇండస్ట్రీకి తీరని లోటని పేర్కొంది. ఒరియా సూపర్ స్టార్ సిద్దాంత్ మహోపాత్ర నంద మృతిపై మీడియాతో మాట్లాడుతూ… తన మిత్రుడు నంద మృతిపై సంతాపం తెలియజేశారు. నంద తనకు చిన్న తమ్ముడిలాంటి వాడని పేర్కొన్నారు. నంద ఆకస్మిక మరణం బాధాకరమన్నారు. కాగా, నంద బంధువు ఒకరు ఆయనకు కాలేయం దానం చేయటానికి సిద్దమయ్యారు. బ్లడ్ గ్రూపులు వేరుకావటంతో అది కుదరలేదు. కాలేయం కోసం ప్రయత్నాలు చేస్తుండగానే నంద చనిపోయారు. మరి, నంద కాలేయ సంబంధిత వ్యాధితో 45 ఏళ్లకే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.